Pawan Kalyan : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నప్పటికి కొంతమంది సక్సెస్ లను సాధిస్తే మరి కొంతమంది మాత్రం ఫెయిల్యూర్ ని మూటగట్టుకుంటున్నారు. ఒక సక్సెస్ ని సాధించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. అనుక్షణం సినిమా కోసం తపిస్తూ అదే ఆలోచనలో ఉండి, అదే శ్వాస, ధ్యాసగా బతికిన వాళ్లకు మాత్రమే ఇక్కడ సక్సెస్ లు లభిస్తూ ఉంటాయి.
Also Read : నేటి నుండి ఓజీ షూటింగ్ ప్రారంభం..పవన్ సెట్స్ లోకి అడుగుపెట్టేది ఆరోజే!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) అటు రాజకీయాలు, ఇటు సినిమాలు ఏకకాలంలో రెండింటిని మ్యానేజ్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఆయన ఫుల్ టైం పొలిటిషన్ గా మారిపోయాడు. కాబట్టి ఇక మీదట సినిమాలు చేయకుండా సినిమాలకు బ్రేక్ ఇస్తే మంచిదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం వల్ల ఆయా దర్శక నిర్మాతలకు విపరీతమైన నష్టమైతే వాటిల్లుతుందట. ఆయన సినిమాకి కమిట్ అయి పది రోజులు షూట్ చేసి మిగతా రోజులను ఎప్పుడు చేస్తాడు అనే క్లారిటీ అయితే ఉండదు. కాబట్టి ఆయన షూట్ చేసిన దానికి ఫలితం లేకుండా పోతుంది.ఈ సినిమాని వదిలేయకుండా మరో సినిమాని కమిట్ అవ్వకుండా దర్శక నిర్మాతలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీనివల్ల అటు టైము ఇటు డబ్బు రెండు వృధా అయిపోతున్నాయి. అనే ఉద్దేశ్యంతో ఆయనతో సినిమా చేయడానికి ఇప్పుడు చాలామంది దర్శక నిర్మాతలు భయపడిపోతున్నారు. ఇక ఇప్పటికే ఆయన సెట్స్ మీద మూడు సినిమాలను ఉంచాడు. దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి వాటిని అలాగే ఉంచుతూ వస్తున్నాడు.
ఇక ఎట్టకేలకు ఈనెల 30వ తేదీన ‘హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో సుజిత్ (Sujith) డైరెక్షన్లో రాబోతున్న ఓజీ (OG) సినిమాని సైతం తొందరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ రెండు సినిమాలతో పాటు హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ (Usthad Bhagath Sing) సినిమాని సైతం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలను పూర్తి చేసి ఆయన ఫుల్ టైం పొలిటిషన్ గా మారిపోతే మంచిది.
Also Read : ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కి పవన్ భారీ ఆర్ధిక సాయం..కంటతడి పెట్టిస్తున్న వీడియో!
అభిమానులు అలరించడానికి ఆయన సినిమాలు చేయాలి అనుకుంటే దానిమీద డేట్స్ ని కేటాయించి సినిమా చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది. అలా కాకుండా ఇష్టం వచ్చినప్పుడు షూట్ చేస్తే మాత్రం అది అందరికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఆయన ఇక మీదట సినిమాలు చేయకపోవడమే మంచిది అంటూ కొంతమంది సినిమా మేధావులు, విమర్శకులు సైతం అతని మీద కామెంట్లైతే చేస్తున్నారు…