
Pawan Kalyan : పవన్ కళ్యాణ్..నిజంగా ఒక యోగినే.. రోజుకు రూ.2 కోట్ల పారితోషికం తీసుకునే ఒక స్టార్ ఎంత స్టేటస్ మెయింటేన్ చేస్తాడు.? ఎంత లగ్జరీగా ఉంటాడు. కానీ పవన్ మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకం ఆయన రూట్ నే సపరేట్.
ఒక మామూలు చాప.. ఒక అరుగు.. వెనుకాల వ్యవసాయ క్షేత్రం.. మధ్యలో బంతి పూలతో అలంకరణ.. అందులో ఒక దీపం.. చాప మీద కూర్చొని ఒక సాధారణ మనిషిలా.. గుబురు గడ్డం, జుట్టుతో ఒక రుషిలా పవన్ కళ్యాణ్ కనిపించాడు. అందరికీ తనదైన శైలిలో శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఇంత సింప్లిసిటీగా కింద కూర్చొని తెల్ల చొక్క లుంగీతో కనిపించిన తీరు హైలెట్ గా నిలుస్తోంది. పవన్ ఎంత ఎదిగినా తన మూలాలు మరిచిపోకుండా సాదాసీదాగా ఉన్న తీరు అందరికీ స్ఫూర్తినిస్తోంది.
కొద్దిరోజులుగా రాజకీయాల్లో కనిపించడం లేదు పవన్ కళ్యాణ్. జనసేన ఆవిర్భావ సభ తర్వాత బయట కనిపించలేదు. అయితే వరుస సినిమాలు ఉండడంతో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ పవన్ ఎలా ఉన్నాడు? ఎలా తన పండుగలను జరుపుకుంటున్నాడన్నది అభిమానుల్లో ఆసక్తి ఉంటుంది. అయితే తన వ్యవసాయ క్షేత్రంలో పవన్ శ్రీరామనవిమిని జరుపుకున్నారు.
సాదాసీదాగా పూజ చేసి ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ ధర్మం మూర్తీభవించిన పరమాత్ముడు శ్రీరామచంద్రుడు. తాను రక్షిస్తానని అభయమిస్తే ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుదిరగకుండా రక్షించగల కరుణారసమూర్తికి శ్రీరామనవమి వేడుకల వేళ భక్తిపూర్వకంగా ప్రణతులర్పిస్తున్నాను’ అంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలను పవన్ తెలిపారు. పవన్ షేర్ చేసిన ఆయన ఫొటోమాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.