Akira Nandan: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తనయుడు అకిరా నందన్(Akira Nandan) నేడు హై కోర్టుని ఆశ్రయించడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన వ్యక్తిగత ఫోటోలను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని, AI ని ఉపయోగించి ఫేక్ వీడియోలు, ఫేక్ మార్ఫింగ్ ఫోటోలను క్రియేట్ చేస్తున్నారని, ఇకపై తన వ్యక్తిగత ఫోటోలకు భద్రతా కల్పించాలంటూ ఆయన తన పిటీషన్ లో పేర్కొన్నారు. అకిరా నందన్ పిటీషన్ ని స్వీకరించిన హై కోర్టు, త్వరలోనే ఈ విషయం లో తీర్పు ఇవ్వనుంది. ఇలా కేవలం అకిరా నందన్ మాత్రమే కాదు, ఇండియా వైడ్ గా ఉన్న టాప్ మోస్ట్ సెలబ్రిటీలందరూ తమ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలకు భద్రతా కల్పించాలంటూ హై కోర్టు ని ఆశ్రయయించడం, అందుకు హై కోర్టు కూడా అనుమతి ని ఇవ్వడం మనమంతా చూసాము.
ఐశ్వర్య రాయి బచ్చన్ తో ఇది మొదలైంది. ఆ తర్వాత హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లు ఇదే తరహా ప్రక్రియ ని కొనసాగించారు. ఇప్పుడు అకిరా నందన్ కూడా అదే బాట పట్టాడు. సినీ ఇండస్ట్రీ లోకి అకిరా నందన్ ఇంకా అడుగుపెట్టలేదు. అయినప్పటికీ ఈయనకు సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. చూసేందుకు హాలీవుడ్ హీరో లాగా ఉన్నాడు, ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే ఎవ్వరూ చూడనంత క్రేజ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూస్తాడు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్పుకొస్తూ ఉండేవారు. రీసెంట్ గా ఒక అమ్మాయి, అకిరా నందన్ ఫోటోలను పొలాలు చుట్టూ పెట్టుకొని డ్యాన్స్ వేసిన వీడియో ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇలా అభిమానం తో ఎన్నైనా చేయొచ్చు కానీ, కొంతమంది ఆకతాయిలు మాత్రం అకిరా ఫోటోలను అసభ్యకరంగా వినియోగిస్తున్నారు.
అలాంటి దుండగుల నుండి తన వ్యక్తిగత ఫోటోలకు భద్రతా కల్పించమనే ఆయన హై కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. సినీ ఇండస్ట్రీ లోకి రాక ముందే అకిరా నందన్ కి అభిమానులు, దురాభిమానులు ఉన్నారు. ఇక ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడానికి కూడా కష్టమే. బయట హీరోలతో పోటీ సంగతి పక్కన పెడితే, అకిరా నందన్ కి సొంత మెగా ఫ్యామిలీ లోనే పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో పోటీ పడాల్సి ఉంటుంది. మరి ఆ రేంజ్ కి వెళ్లగలిగే సత్తా అకిరా లో ఉందా లేదా అనేది తెలియాలంటే మరికొన్నేళ్లు ఎదురు చూడక తప్పదు.