Pawan Kalyan Son Akira Nandan: తండ్రికి తగ్గ తనయుడు.. బ్లడ్ డొనేట్ చేసిన అకిరానందన్.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అకీరా నందన్ .. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ ల పెద్ద కొడుకు. ఈ ఇది చాలు అతను ఏం చేసినా వైరల్ కావడానికి. రేణుదేశాయ్ కూడా అకీరా గురించి సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తుండటంతో ఎప్పుడూ వైరల్ అవుతుంటారు. అకీరా కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. అకిరాకు చాలా విషయాల్లో తండ్రి పోలికలే వచ్చాయని అందరూ అంటుంటారు. ఆయన లాగే అకీరా నందన్ కూడా బాక్సింగ్, కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.

కాగా అకీరా సిని ఎంట్రీపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. రేణుదేశాయ్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది… అకీరా కి సినిమాలపై ఇంట్రెస్ట్ లేదని.. ఎంట్రీ ఎండదని అయినా కూడా అభిమానుల్లో ఎక్కడో ఒక్క చోట ఎంట్రీ పై ఆశగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా అకీరాకు 18 ఏళ్లు నిండటంటో మొదటి సారి బ్లడ్ డొనేట్ చేశాడు.
Also Read: AP Power Cuts: ఏపీలో విద్యుత్ సంక్షోభం.. పరిశ్రమలకు పవర్ హాలీడే పొడిగింపు
ఈ విషయాన్ని రేణుదేశాయ్ సోషల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా వెల్లడించింది. 18 ఏళ్లు నిండిన తర్వాత అకీరా చేసిన మొదటి రక్తదానం. అవసరంలో ఉన్న వారికి మనం ఇచ్చే అత్యంత విలువైన వస్తువు రక్తదానం. దయచేసి మీకు 18 ఏళ్లు నిండిన తర్వాత రక్తదానం చేయండి. మీరు ఎవరి ప్రాణాలను కాపాడగలరో ఎవరికీ తెలియదు అంటూ రేణుదేశాయ్ పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అకీరాని అందరూ అభినందిస్తున్నారు. అకీరా ఇండస్ట్రీ ఎంట్రీపై కూడా మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి అకీరా క్రేజ్ సినిమాల్లోకి రాకముందే పెరిగిపోతోంది. ఇక ఈ ఆరడుగుల బుల్లెట్ వస్తే ఎన్ని సునామీలు సృష్టిస్తాడోనని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవతున్నారు. అకీరా ఫొటోస్ షేర్ చేస్తూ సంబరపడిపోతున్నారు.
Also Read:Petrol, Diesel Prices In India: దేశంలో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కడెక్కడ ఎంత..?
Recommended Videos: