Akhira Nandan in OG Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ప్రస్తుతం ఆయన సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఇక ఈనెల 25వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక అందులో భాగంగానే ఇక ఇక్కడ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉండడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ అద్భుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంది. అయితే ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరా నందన్ కూడా ఇందులో కీలక పాత్ర లో నటించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఈ సినిమాలో అఖిరా నందన్ సంబంధించిన ఒక షాట్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓజీ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ ఇమ్రాన్ హష్మి కి ఫోన్ చేసి ముంబై వస్తున్నాను తలలు తీసుకెళ్తా అని చెప్పిన తర్వాత చేతిలో కత్తి పట్టుకొని కిందికి నడుచుకుంటూ వచ్చే ఒక షాట్ ఉంటుంది. అది అఖిరా నందన్ కాళ్లకు సంబంధించిన షాట్ అని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు అనే విషయాలను చెప్పడానికి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఐతే ఉంటాయట. 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ను అఖిరా నందన్ చేత పోషింపజేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా అఖిరా నందన్ కాళ్ళ కు సంబంధించిన షాట్ వేసి అతను ఈ సినిమాలో బాగా అయ్యేలా చేశాడు.
ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో చేస్తున్నాడనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధిస్తోంది అనేది తెలియాలంటే మాత్రం మరొక రెండు రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది…