https://oktelugu.com/

పవన్ కళ్యాణ్ షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ మరియు క్రిష్ లతో చేస్తోన్న సినిమాల షూటింగ్ బ్యాలెన్స్ పార్ట్ ను అక్టోబర్ 6న నుండి మొదలుపెట్టి డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని దాదాపు రెండు సినిమాల కోసం మూడు నెలలు టైంను పవన్ కేటాయించాడు. ముందుగా వకీల్ సాబ్ షూట్ ను నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరిపి సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ […]

Written By:
  • admin
  • , Updated On : October 1, 2020 / 05:06 PM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ మరియు క్రిష్ లతో చేస్తోన్న సినిమాల షూటింగ్ బ్యాలెన్స్ పార్ట్ ను అక్టోబర్ 6న నుండి మొదలుపెట్టి డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని దాదాపు రెండు సినిమాల కోసం మూడు నెలలు టైంను పవన్ కేటాయించాడు. ముందుగా వకీల్ సాబ్ షూట్ ను నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరిపి సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ గెస్ట్ రోల్ చేస్తోంది. అలాగే నివేదా థామస్, అనన్య నాగళ్ళ, అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాతి రేసులో టాప్ ప్లేస్ లో ఉండటం ఖాయం.

    Also Read: పూరి విశ్లేషణ: ధనవంతులు దేశం విడిచి ఎందుకు పోతున్నారు?

    ఇక క్రిష్ – పవన్ సినిమా డిసెంబర్ లో నుంచి మళ్ళీ సెట్స్ మీదకి వెళ్ళనుంది. వచ్చే విజయదశమి పండుగ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. క్రిష్ ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడని.. పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. పైగా పవన్ కళ్యాణ్ కూడా తన కెరీర్ లో ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చేయకపోవడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలలో కూడా ఈ సినిమా పై అమితాసక్తి ఉంది. ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. కానీ చిత్ర బృందం నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

    కాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తీసుకురానున్నారు. అందుకే క్రిష్ ఈ సినిమాకి మరింత గ్రాండ్ నెస్ ను తీసుకు వచ్చేందుకు పరభాషా నటులను కూడా ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పవన్ ను చూసి ఓ గిరిజిన యువతి ప్రేమలో పడుతుందని.. ఆ పాత్రలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ను తీసుకోనున్నారట. ఇక ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

    Also Read: అదే హీరో నాని సినిమాలు ఆడకపోవడానికి కారణమా?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్ళిపోయాడు.. ఇక రాడు అనుకున్న వాళ్ళకి టన్నులకొద్ది సర్‌ప్రైజెస్ ఇచ్చాడు. రీ ఎంట్రీ ఇస్తూ వరసగా ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నాడు. అంతేకాదు ఇప్పటికే నాలుగు సినిమాలు కమిటై వాటిలో ఒక సినిమా దాదాపు కంప్లీట్ చేశాడు. ఇంతలోనే డై హార్ట్ ఫ్యాన్ బండ్ల గణేష్ తో మరో సినిమా ని ఇటీవల అనౌన్స్ చేశాడు. కనీసం 3 సినిమాలు 2021 లో రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు.