Hari Hara VeeraMallu : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. హిపోక్రసీకి ఆయన దూరంగా ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి అయినప్పటికీ.. ఆయన స్టార్ డం అసలు చూపించరు అంటారు. అదే సమయంలో తనపై వచ్చే విమర్శలకు ఆయన అదే శైలిలో సమాధానం చెబుతారు అంటారు. ఇటీవల కాలంలో జనసేన అధినేత పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా.. తను ఇక్కడే పుట్టానని.. ఈ ప్రాంతంతో తనకు సంబంధం ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను పట్టుకొని కొంతమంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను విమర్శించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రోజా లాంటి పొలిటిషన్స్ అయితే “ఆయన ఎక్కడ పుట్టారో ఆయనకే తెలియదు. కాసేపు నెల్లూరులో పుట్టాను అంటారు. కాసేపటికి విజయవాడతో తనకు సంబంధం ఉందంటారు. ఇంకాసేపటికి ప్రకాశంతో అవినాభావ సంబంధం ఉందంటారు. తిరుపతి వెళ్తే తను ఇక్కడ పెరిగాను అని చెబుతారు.. అసలు ఆయన ఎక్కడ పుట్టారు.. ఎక్కడ పెరిగారు.. అసలు ఆయన చెప్తుంది మొత్తం నిజమేనా” అని ఇటీవల విమర్శించారు. ఈ విమర్శలు బహుశా జన సేనాని దాకా వెళ్ళినట్టు ఉన్నాయి. దీంతో ఆయన స్పందించక తప్పలేదు.
“అంటుంటారు…. ఈ పవన్ కళ్యాణ్ ఏ ఊరు వెళ్ళినా ఆ ఊర్లోనే పెరిగాను అంటాడని…
నా పేరు పవనం… నేను తిరుగుతా ఉంటాను…
మనం పవనాలు… అవి బావిలో కప్పలు.” pic.twitter.com/Vmv0kmrouT
— Gulte (@GulteOfficial) July 23, 2025
ప్రస్తుతం ఆయన హరి హర వీరమల్లు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రచారానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. సినిమాకు సంబంధించిన విషయాలు చెబుతూనే.. రాజకీయంగా తన విమర్శిస్తున్న వారికి గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు..”ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ఆ ఊర్లోనే పెరిగాను అంటాడు. చాలామంది ఇలా అంటూనే ఉంటారు. నేను ఒకటి చెబుతున్న. నా పేరు పవనం. నేను తిరుగుతూనే ఉంటాను. మనం పవనాలు. అవి బావిలో కప్పలు” అని పేరు ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ అందరికీ ఒక్క మాటతోనే గట్టి కౌంటర్ ఇచ్చారు. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడుతుంటారు. కానీ హరిహర విరమల్లు ప్రచార కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ తన సహజ శైలికి భిన్నంగా మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా.. సినిమా నటుడిగా కాకుండా.. మనిషిలాగా మాట్లాడుతున్నారు. అందువల్లే హరిహర వీరమల్లు కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంతేకాదు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా కావడం.. ఇటీవల కాలంలో పెద్ద చిత్రాలు అంతగా విడుదల కాకపోవడంతో.. ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉండడం.. కొన్ని మీడియా సంస్థలు కావాలని వ్యతిరేక ప్రచారం చేయడం.. ఇవన్నీ కూడా ఈ సినిమాకు కలిసి వస్తాయని చిత్ర నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..
ట్విట్టర్ ట్రోల్స్ గురించి పవన్ వ్యాఖ్య: అవి బావిలో కప్పలు!#trolling #trolls pic.twitter.com/1GlZt97vIb
— M9 NEWS (@M9News_) July 23, 2025
ఇటీవల కాలంలో వైసిపి నాయకులు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు జన సేనాని నటించిన నూతన చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో వైసీపీ అనుకూల మీడియా విపరీతమైన నెగిటివ్ ప్రచారాన్ని చేస్తోంది.. ఇందులో భాగంగానే గతంలో జరిగిన గొడవలను ఇప్పటి విషయాలకు లంకె వేస్తూ.. లేని రచ్చను లేపడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇవేవీ తన సినిమాకు వర్తించవని.. ఎలాంటి నెగెటివ్ ప్రచారం చేసినా తన సినిమాకు ఏమీ కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం విశేషం. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ తనను తాను తక్కువ చేసుకొని మాట్లాడారు. తాను అంత గొప్ప నటుడిని కాదని.. తన సినిమాకు అంత మార్కెట్ లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సహజంగానే అవకాశం కోసం ఎదురుచూస్తున్న వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేశాయి.