Hari Hara Veeramallu: ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోలు బరిలోకి దిగనున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సినిమాలు ఈ పోరులో పాటీపడనున్నాయి. జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుండగా.. 13న భీమ్లానాయక్, 14న రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈరోజు విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. మరోవైపు భీమ్లానాయక్‌గా తన పవర్ చూపించేందుకు పవన్‌కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు.

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లె అందిస్తున్నారు. కాగా, మరోవైపు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో కలిసి హరిహర వీరమల్లు సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా కనిపించనుంది. ఎఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా తర్వాత షెడ్యూల్ కొత్త సంవత్సరంలో మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా క్రిష్ ఫాస్ట్ గా పూర్తి చేశారు.
తాజాగా, పవన్ కళ్యాణ్‌ను కలిసి స్క్రిప్ట్ చూపించగా.. ఆయన క్షుణ్నంగా పరిశీలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను క్రిష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పాటు వచ్చే నెలలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.