Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో చాలా ఎవ్వరికీ లేని క్రేజ్ సమపదించుకొని టాప్ హీరో గా ఎదిగాడు. అయితే తను సినిమా ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు సంపాదించుకుంటున్న సమయంలో తం ఫ్రెండ్ అయిన ఆనంద్ సాయి ని కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఆర్ట్ డైరెక్టర్ గా పరిచయం చేయాలని ప్రయత్నం చేశాడు.
ఇక అందులో భాగంగానే కరుణాకరన్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలిప్రేమ సినిమాలో గగనానికి హృదయం ఒకటే అనే పాటలో ఎడారిలో తాజ్ మహల్ సెట్ వేసే పనిని పవన్ కళ్యాణ్ ఆనంద్ సాయికి అప్పజెప్పాడు. అలాగే దర్శక, నిర్మాతలను ఒప్పించి తనను ఆర్ట్ డైరెక్టర్ గా ఆ సినిమాకు తీసుకున్నాడు.ఇక అందులో భాగంగానే తాజ్మహల్ సెట్ కి దాదాపు పది లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో కొత్త ఆర్ట్ డైరెక్టర్ తో అలాంటి భారీ సెట్ ని ఎలా వేయించాలి అని ప్రొడ్యూసర్ ఇబ్బంది పడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ఆలోచించకుండా ఆనంద్ సాయి మీద ఉన్న ధైర్యంతో ప్రస్తుతము అయితే ఆనంద్ సాయి ని సెట్ వేయనివ్వండి.
ఒకవేళ అది ఫెయిల్ అయినట్టు అయితే దానికి డబ్బులు నేను మీకు పే చేస్తాను అని ప్రొడ్యూసర్ కి కూడా ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించాడు. ఇక ఆనంద్ సాయి కూడా సెట్ ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. దాంతో తనకి ఆర్ట్ డైరెక్టర్ గా మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో అది హైలెట్ గా నిలవడమే కాకుండా ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది.
ఇక అప్పటినుంచి ఆనంద్ సాయి ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ని ఎవ్వరైన నమ్మితే చివరి క్షణం వరకు ఆయన మనతో పాటు తోడుగా ఉంటాడు అని చెప్పడానికి ఆనంద్ సాయిని ఒక ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తన ఫ్రెండ్ అయిన ఆనంద్ సాయిని కూడా సినిమా ఇండస్ట్రీలోనే సెటిల్ చేసి తనని టాప్ ఆర్ట్ డైరెక్టర్ గా తీర్చిదిద్దాడు.