https://oktelugu.com/

పవన్ వాటికి రెడీ.. నేటి నుంచి యాక్టివ్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత మూడు నెలలుగా సైలెంట్ గా ఉంటున్నారు. ఇటు సినిమాలకు అటు రాజకీయాలకు పవన్ దూరం జరిగాడు. అయితే తన ఈ విరామం తర్వాత మళ్ళీ పవన్ యాక్టివ్ గా మారబోతున్నాడు. నేటి నుంచి రాజకీయ బాటలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇన్నాళ్లు అంటే కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఉన్న కారణంగా పవన్ అన్నిటికి గ్యాప్ ఇచ్చాడు. అయినా, కరోనా కాలంలో రాజకీయాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని… […]

Written By: , Updated On : July 6, 2021 / 10:32 AM IST
Follow us on

Pawanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత మూడు నెలలుగా సైలెంట్ గా ఉంటున్నారు. ఇటు సినిమాలకు అటు రాజకీయాలకు పవన్ దూరం జరిగాడు. అయితే తన ఈ విరామం తర్వాత మళ్ళీ పవన్ యాక్టివ్ గా మారబోతున్నాడు. నేటి నుంచి రాజకీయ బాటలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇన్నాళ్లు అంటే కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఉన్న కారణంగా పవన్ అన్నిటికి గ్యాప్ ఇచ్చాడు.

అయినా, కరోనా కాలంలో రాజకీయాలు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని… ఆ ఉద్దేశంతోనే మౌనం పాటించాను అని ఆ మధ్య పవన్ చెప్పినట్టు గుర్తు. ఇక ఎలాగూ ఇప్పుడు కరోనా సెకెండ్ వేవ్ పూర్తిగా తగ్గింది కాబట్టి, అలాగే ఆంధ్రాలో కర్ఫ్యూ సడలింపులు కూడా వచ్చాయి కాబట్టి.. ఇక తానూ రంగంలోకి దిగాల్సిందే అని పవన్ నిర్ణయించుకున్నారు.

నిర్ణయం తీసుకున్న వెంటనే నేటి నుంచి విజయవాడలో జనసేనాని జనసేన కార్యకలాపాలు షురూ చేయనున్నారు. అలాగే, పవన్ కళ్యాణ్ వచ్చే వారం నుంచి షూటింగ్ లో కూడా పాల్గొనడానికి డేట్లు ఇచ్చేశాడు. యువ దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న “అయ్యపనం కోషియం” తెలుగు రీమేక్ కోసం పవన్ పది రోజుల పాటు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇక కరోనా సెకెండ్ వేవ్ లో పవన్ కళ్యాణ్ కూడా కరోనా బాధితుడే. కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత హైదరాబాద్ లోని తన ఫార్మ్ హౌస్ లో ఉండి అపోలో డాక్టర్స్ సాయంతో కరోనా చికిత్స తీసుకున్నాడు పవన్. రామ్ చరణ్ స్వయంగా పవన్ కరోనా ట్రీట్మెంట్ ను చూసుకోవడం విశేషం.