Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) రెమ్యూనరేషన్ విషయం లో ఇండియా లోనే నెంబర్ 1 గా నిలవబోతున్నాడా?, ప్రభాస్(Rebel Star Prabhas), రామ్ చరణ్(Global Star Ram Charan), అల్లు అర్జున్(Icon Star Allu Arjun) వంటి పాన్ ఇండియన్ స్టార్స్ కంటే ఎక్కువ తీసుకోబోతున్నాడా? అంటే అవుననే చెప్పాలి. అది కూడా పాన్ ఇండియన్ సినిమాకి పవన్ కళ్యాణ్ అంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనుకుంటే పెద్ద పొరపాటే. ఆయన ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నది ఒక ప్రాంతీయ బాషా చిత్రం కోసం, ఆ సినిమా మరేదో కాదు ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పై తెరకెక్కబోతున్న ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కి సంబంధించి 20 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసారు. రెండు గ్లింప్స్ వీడియో ని కూడా వదిలారు.
Also Read : 30 ఏళ్ళు వెనక్కి వెళ్లనున్న పవన్ కళ్యాణ్..ఫ్యాన్స్ కి ఇక పండగే!
రీసెంట్ గానే ఈ చిత్ర నిర్మాత రవి శంకర్ ని కలిసిన పవన్ కళ్యాణ్ జులై నెల నుండి నాన్ స్టాప్ గా డేట్స్ ఇస్తానని మాట ఇచ్చాడట. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అక్షరాలా 172 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అందులో 50 కోట్ల రూపాయిల అడ్వాన్స్ ఇచ్చి చాలా కాలమే అయ్యింది. ఒక ప్రాంతీయ బాషా చిత్రానికి ఇంత రెమ్యూనరేషన్ ఒక హీరో తీసుకోవడం అనేది ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో జరగలేదు. పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు వంద కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నారు కానీ, ఈ రేంజ్ లో మాత్రం అందుకోవడం లేదు. అసలు నిర్మాత ఇంత రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తున్నాడు?, ఎలా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాడు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఎందుకంటే కేవలం తెలుగు వెర్షన్ నుండి ఎంత ఇరగ కుమ్మిన 175 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఒక రీజనల్ చిత్రానికి రావడం అసాధ్యం. బాహుబలి సిరీస్, పుష్ప 2 , #RRR వంటి సినిమాలు మాత్రమే ఇప్పటి వరకు తెలుగు వెర్షన్ నుండి ఈ స్థాయి వసూళ్లను రాబట్టాయి. వినిపిస్తున్న టాక్ ఏమిటంటే స్క్రిప్ట్ మొత్తం మార్చేశారని, ఇంతకు ముందు ప్రాంతీయ బాషా చిత్రం రేంజ్ లో ఉంటే, ఇప్పుడు స్టోరీ లో స్కోప్ పెంచి పాన్ ఇండియన్ సినిమాని చేసారని, అందుకే అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారని టాక్. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రానికి 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించున్న చిత్రమిదే. దానికే వంద కోట్ల రెమ్యూనరేషన్ అంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి 172 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఏ విధంగా నిర్మాతకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Also Read : స్టార్ నిర్మాతలతో పవన్ కళ్యాణ్ అత్యవసర భేటీ..విషయం ఏమిటంటే!