Pawan Kalyan – Ram Gopal Varma combo : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). నాగార్జున(Nagarjuna) తో చేసిన శివ (Shiva) సినిమాతో మొదటి సక్సెస్ ను అందుకున్న ఆయన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసిన దర్శకుడిగా చాలా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన తర్వాత రాబోయే సినిమాలు కూడా భారీ విజయాలను సాధిస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఆయన అడపాదడప సక్సెస్ లను సాధిస్తూ వీలైనంతవరకు ఫ్లాప్ లను మూట గట్టుకున్నాడు. అయినప్పటికి ఆయన సినిమాలు హిట్ అయితే మాట భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచేవి… చిరంజీవి(Chiranjeevi) తో సినిమాను స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేసి ముంబాయి వెళ్లిపోయిన రామ్ గోపాల్ వర్మ అప్పటినుంచి ఇప్పటివరకు చిరంజీవితో సినిమా చేయలేదు. కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని చాలావరకు ట్రై చేశాడు. ఇక అతనికి ఒక కథను కూడా వినిపించారట.
అన్యాయం మీద పోరాటం చేసే ఒక క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ ని చూపించాలని తను విశ్వ ప్రయత్నం చేసినప్పటికి పవన్ కళ్యాణ్ అప్పుడున్న బిజీ వల్ల రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయలేకపోయాడు. ఇక ఆ స్క్రిప్ట్ ను చేస్తే పవన్ కళ్యాణ్ తోనే చేయాల్సి తప్ప వేరే వాళ్ళతో చేయడం కుదరదని వర్మ అప్పటినుంచి ఇప్పటివరకు ఆ స్క్రిప్ట్ ను అలాగే పక్కన పెట్టేసారట.
Also Read : మోసగాళ్లను వెనుకేసుకొస్తున్న ఆర్జీవీ.. పవన్ పై అందుకే కోపం
మరి ఏది ఏమైనా కూడా ఆర్జీవీకి ఉన్న ఘట్స్ అంటే చాలా మందికి ఇష్టం. ఆయనంటే గౌరవం అయితే ఉంటుంది. కానీ ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాలను చూస్తే ప్రతి ఒక్కరికి అతన్ని తిట్టుకోవాలనిపిస్తుంది. కానీ అతను మాత్రం తను చేయాలనుకున్న సినిమాలను చేస్తానని నచ్చితే చూడండి లేకపోతే మానేయండి అంటూ ఆయన ప్రేక్షకులకు ఒక కండిషన్ అయితే పెట్టాడు.
మొత్తానికైతే ఆర్జీవీ నుంచి వచ్చిన శిష్యులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నప్పటికి వర్మ మాత్రం ఇప్పటికి తనకు నచ్చిన సినిమాలను మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఒకరి కోసం కాంప్రమైజ్ అయి హీరోయిజం ఎలివేట్ చేసే సినిమాలను రాసి చేయడం తనకు చేతకాదని చెబుతూ ఉంటాడు అందువల్లే ఆర్జీవి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. కెరియర్ స్టార్టింగ్ లో ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి చాలామంది కుర్రాళ్ళు పోటీపడ్డారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…