spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Rajinikanth Movie: పవన్ కళ్యాణ్ సినిమాలో రజినీకాంత్ నటించాల్సిందా...ఆయన రిజెక్ట్ చేయడానికి కారణం...

Pawan Kalyan Rajinikanth Movie: పవన్ కళ్యాణ్ సినిమాలో రజినీకాంత్ నటించాల్సిందా…ఆయన రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే….

Pawan Kalyan Rajinikanth Movie: ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు పవన్ కళ్యాణ్…ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యమైన కథాంశమైతే ఉంటుంది… ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటీని మెంటైన్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ఒక సూపర్ హిట్ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ను సైతం ఒక కీలకమైన పాత్రలో నటింపజేయాలనే ప్రయత్నం చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు…

ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘పులి’ సినిమా కావడం విశేషం… ఈ సినిమాలో రజనీకాంత్ కోసం ఒక స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేశారట. కానీ రజనీకాంత్ కి ఆ పాత్రలో నటించడం ఇష్టం లేకపోవడం వల్ల ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రజినీకాంత్ పవన్ కళ్యాణ్ ను పర్సనల్ గా కలిసి వేరే ఇంకేదైనా మంచి కథలో మనిద్దరం కలిసి మల్టీస్టారర్ సినిమా చేద్దాం.

కానీ ఈ క్యారెక్టర్ లో మాత్రం నేను నటించలేనని చెప్పాడట. దానికి పవన్ కళ్యాణ్ సైతం రజనీకాంత్ ని అర్థం చేసుకొని ఓకే అన్నాడట. మొత్తానికైతే రజినీకాంత్ రిజెక్ట్ చేసిన ఆ పాత్ర సినిమాలో వద్దని ఎస్.జె. సూర్యతో చెప్పాడట. దాంతో క్యారెక్టర్ ని తీసేసి మళ్లీ కథను చేంజ్ చేసినట్టుగా తెలుస్తుంది.

మొత్తానికైతే పులి సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయి డిజాస్టర్ టాక్ ను మూట గట్టుకున్న విషయం మనకు తెలిసిందే… ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు తమదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక ఆయన అటు పాలిటిక్స్ లో రాణిస్తూనే ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు అంటే మామూలు విషయం కాదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular