Sujeeth Vs Harish Shankar: 5 నెలల గ్యాప్ లో క్రియేటివిటీ విషయం లో ఎంత వ్యత్యాసం ఉందో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తన సినిమాలతో మరోసారి అందరికీ చూపించాడు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదలైన ‘ఓజీ’ చిత్రం జెన్ జీ యూత్ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో అలరించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఆ సినిమాలోని సన్నివేశాలను మీమ్స్ గా వాడుకుంటూనే ఉంటారు. ఇక ఆ చిత్రానికి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నేషనల్ లెవెల్ ని దాటిపోయి, ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళిపోయింది. అలాంటి సినిమా విడుదలైన 5 నెలలకు పవన్ కళ్యాణ్ నుండి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం వచ్చింది. ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఓపెనింగ్స్ దగ్గర నుండి, లాంగ్ రన్ వరకు డిజాస్టర్ ఫలితాన్ని చూసిన చిత్రమిది.
ఈ రెండు సినిమాలకు ఎంత తేడా ఉందో మీరే చూడండి. ఓజీ చిత్రానికి మొదటి రోజే 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదలై 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా 100 కోట్ల గ్రాస్ ని రాబట్టలేకపోయింది. ఈ సినిమా ఇంత పెద్ద డిజాస్టర్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రీమేక్ అనే ప్రచారం అయితే, మరొకటి సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పై భజన. ఓజీ డైరెక్టర్ సుజిత్ , ఉస్తాద్ డైరెక్టర్ హరీష్ శంకర్, ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమానులు కానీ సుజిత్ తన అభిమానం ని పనితనం లో చూపించాడు, కానీ హరీష్ శంకర్ భజన చేయడమే తన అభిమానం కి నిదర్శనం అనుకున్నాడు. అందుకే రెండిటికి ఇంత వ్యత్యాసం ఉన్న ఫలితాలు వచ్చాయి. ‘ఓజీ’ చిత్రం లో ప్రతీ షాట్ ఐకానిక్ రేంజ్ లో ఉంటాయి.
పవన్ కళ్యాణ్ ని మించిన తోపు ఇండియా లో ఎవ్వరూ లేరు అనే రేంజ్ లో ఆ చిత్రంలో హీరో క్యారెక్టర్ ని చూపించాడు డైరెక్టర్ సుజిత్. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో పొలిటికల్ రిఫరెన్స్ లు పెట్టి , కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు చూస్తే చాలు అన్నట్టుగా తీసాడు హరీష్ శంకర్. ఈ సినిమా ఫైనల్ ఔట్పుట్ ని చూసుకున్నప్పుడు , గబ్బర్ సింగ్ చిత్రాన్ని ఒకసారి చూసుకొని ఉండుంటే హరీష్ శంకర్ కి ఒక క్లారిటీ వచ్చేది. హీరో క్యారెక్టర్ అందులో ఎలా ఉంది, ఆ సినిమాలో భజన లేకుండా, కేవలం హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ ఎలాంటి సన్నివేశాలు రాశాడో ఆయనకు కూడా అర్థం అయ్యి ఉండేది. తానూ నమ్మిన భజన తో సినిమా చేసి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ పరువు తీసేలా చేసి, తన కెరీర్ కి కూడా ముగింపు పలుకున్నాడు హరీష్ శంకర్.