OG Movie Trailer Talk: కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరో మూడు రోజుల్లో సినిమా పెట్టుకొని ఇప్పటి వరకు ట్రైలర్ విడుదల చేయకపోవడం పై అభిమానులు సోషల్ మీడియా లో మూవీ టీం ని ట్యాగ్ చేసి ఎంత అసహనాన్ని వ్యక్తం చేశారో మనమంతా చూస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు విడుదలైన ఏ పాన్ ఇండియన్ సినిమాకు కూడా ట్రైలర్ విషయం లో ఇంతటి జాప్యం జరగలేదు. గ్రాండ్ గా ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వర్షం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. వేలాదిగా అభిమానులు వచ్చి ఈవెంట్ కోసం ఎదురు చూసారు. అయితే అప్పటికీ థియేట్రికల్ ట్రైలర్ పూర్తి స్థాయిలో ఫినిష్ కాకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ పట్టుబట్టి అప్పటికప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ ని ప్రదర్శించేలా చేసాడు.
అది కొంతమంది అభిమానులు సోషల్ మీడియా లో లీక్ చేయడం తో, మేకర్స్ అభిమానుల కోసం కొన్ని అదనపు షాట్స్ ని జోడించి కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో, అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉందా లేదా అనేది వివరంగా చూద్దాము. ఇక ట్రైలర్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ లోని మాస్ విశ్వరూపాన్ని డైరెక్టర్ సుజీత్ బయటకు తీసినట్టు తెలుస్తుంది. ట్రైలర్ ప్రారంభం నుండి చివరి వరకు నరుకుడే నరకుడు. మధ్యలో పవన్ కళ్యాణ్ ఫైరింగ్, ఒక చేతిలో కత్తి, మరో చేతిలో తుపాకీ పట్టుకున్న కొన్ని షాట్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. ఈ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇప్పటి వరకు లేదు అన్నట్టు తెలుస్తుంది. ముంబై వస్తున్నాను, తలలు జాగ్రత్త అంటూ పవన్ కళ్యాణ్ కొట్టిన డైలాగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆయన వాయిస్ లోని బేస్ అదిరిపోయింది.
అంతా బాగానే ఉంది కానీ, చివర్లో పవన్ కళ్యాణ్ ‘ఓజాస్ గంభీరా..నా కొడకల్లారా..నా కొడకల్లారా’ అంటూ ఫైర్ మీద చెప్పే డైలాగ్ కి యాంటీ ఫ్యాన్స్ నుండి కాస్త నెగటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఈ ఒక్క షాట్ కి సోషల్ మీడియా లో ట్రోల్స్, మీమ్స్ చాలా బలంగా పడేలా అనిపిస్తున్నాయి. కానీ సినిమాలో ఎమోషన్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే విధంగా ఈ సన్నివేశం ఉంటే థియేటర్స్ బ్లాస్ట్ అయిపోతాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. మరి అభిమానులకు పిచ్చి పిచ్చి గా నచ్చిన థియేట్రికల్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
View this post on Instagram