Nara Lokesh praises head constable: సమకాలిన అంశాలపై చాలా బాగా స్పందిస్తుంటారు మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh). ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారు. ఏవైనా సమస్యలు తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కార మార్గం చూపుతున్నారు లోకేష్. ఈ క్రమంలో తాజాగా ఓ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ నడుచుకున్న తీరును గుర్తించి అభినందించారు. ఎక్స్ వేదికగా అతని అభినందిస్తూ ట్వీట్ చేశారు. నీ మనసుకు సెల్యూట్ అంటూ ఆ కానిస్టేబుల్ను కొనియాడారు. అంతగా ఆ కానిస్టేబుల్ లోకేష్ ను కదిలించింది ఏంటి? ఎందుకు అంత గొప్ప వ్యాఖ్యలతో అభినందించారు అంటే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
సోషల్ మీడియాలో వైరల్..
సోషల్ మీడియాలో( social media) యాక్టివ్ గా ఉండే నారా లోకేష్ తాజాగా ఓ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వీడియో షేర్ చేశారు. ఆయన కృషిని అభినందిస్తూ హ్యాట్సాఫ్ వెంకటరత్నం గారు .. నీ మనసుకు నా సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. దీంతో వెంకటరత్నం ఎవరు అంటూ అందరూ ఆరా తీయడం ప్రారంభించారు. విజయవాడ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు వెంకటరత్నం. పెనమలూరు కు చెందిన ఆయన ట్రాఫిక్ విధులు నిర్వహిస్తుండగా కొంతమంది చిన్నారులు ఎండకు చెప్పులు లేకుండా నడిచి వెళుతూ కనిపించారు. దీంతో చలించిపోయిన వెంకటరత్నం వారందరికీ సమీపంలోని చెప్పుల దుకాణంలోకి తీసుకెళ్లి సొంత డబ్బులతో కొనిచ్చారు. అయితే ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది విపరీతంగా వైరల్ అయ్యింది. మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్ళింది. వెంటనే నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం ను అభినందించారు.
బరువైన పదాలతో..
బరువైన పదాలతో లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.’ హాట్సాఫ్ వెంకట్ రత్నం( Venkat Ratnam ) గారు.. మీరు స్పందించిన తీరు అభినందనీయం.. ఎండనక, వాననక అప్రమత్తంగా ట్రాఫిక్ ను నియంత్రించే విధి నిర్వహణ.. ఆ టెన్షన్, టెన్షన్లు ఉన్నా మీరు స్పందించిన తీర్పు హ్యాట్సాఫ్. చెప్పుల్లేకుండా ఎండలో నడిచి వెళ్తున్న పిల్లలను చూసి తల్లడిల్లిపోయారు.. వారందరికీ చెప్పుల దుకాణానికి తీసుకెళ్లి సరిపడే సైజు చెప్పులు కొనిచ్చారు. చెప్పులు వేసుకుని వెళ్తూ థాంక్యూ సార్ అని చిన్నారులు బహుమతిగా విసిరిన చిరునవ్వుతో వెంకటరత్నం గారి ముఖంలో వెల్లివిరిసిన సంతృప్తి.. ఎంత గొప్పది. ఇంకెంత అమూల్యమైనది.. మీకు సెల్యూట్ వెంకటరత్నం గారు ‘ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.
హ్యాట్సాఫ్ వెంకటరత్నం గారు
స్పందించిన మీ మనసుకు సెల్యూట్ఎండనక, వాననక అప్రమత్తంగా ట్రాఫిక్ని నియంత్రించే విధి నిర్వహణ. అటెన్షన్, టెన్షన్లు ఉన్నా పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు స్పందించిన తీరుకు హాట్సాఫ్.
చెప్పుల్లేకుండా ఎండలో నడిచి వెళ్తున్న స్కూల్… pic.twitter.com/d2YiMD8xOm— Lokesh Nara (@naralokesh) September 21, 2025