Pawan Kalyan OG Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ లేనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు అతని అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే సమయం దొరికినప్పుడు సినిమాలను చేసి తన అభిమానులను ఆనందపరచడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
ఇక అందులో భాగంగానే ఆయన సుజీత్ డైరెక్షన్ లో చేసిన ఓజీ సినిమా ఈ రోజు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పలు చోట్ల నిన్న నైట్ నుంచే ‘ఓజీ’ సినిమా ప్రీమియర్స్ అయితే వేశారు. ఈ సినిమా ఎలా ఉంది? సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
అతడి పేరు ఓజాస్ గంభీర, అందరూ ముద్దుగా ఓజీ (పవన్ కళ్యాణ్) అని పిలుస్తారు. ఓజీ ఒక అనాథ. జపాన్‌లోని సమురాయ్ (Samurai)ల సమూహంలో పెరిగి పెద్దవాడై, అసాధారణమైన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను సొంతం చేసుకుంటాడు. ఊహించని పరిస్థితుల కారణంగా అతడు శరణార్థిగా ముంబైకి పయనమవుతాడు.
ప్రయాణంలోనే ఓజీకి సత్య దాదా (ప్రకాష్ రాజ్) తారసపడతాడు. తన మనుషులను, ఆస్తులను ప్రమాదం నుంచి కాపాడిన ఓజీని సత్య దాదా సొంత కొడుకులా చూసుకుంటాడు. ముంబైలో ఓ పెద్ద పోర్ట్‌ను స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించిన సత్య దాదాకు ఓజీ నమ్మకమైన రక్షకుడిగా మారతాడు.
అయితే, కొన్ని కారణాల వల్ల ఓజీ సత్య దాదాకు దూరమై, ఆ నగరాన్ని వదిలి వెళ్లిపోతాడు. పదేళ్లకు పైగా ముంబై వైపు కన్నెత్తి కూడా చూడడు.
అలాంటి సమయంలో, ఓమి బవు (ఇమ్రాన్ హష్మి) అనే భయంకరమైన మాఫియా డాన్ రంగ ప్రవేశం చేస్తాడు. ఓమి బవు అడుగుపెట్టడంతో సత్య దాదా కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. దాదా స్థాపించిన పోర్ట్ వ్యాపారం ప్రమాదంలో పడుతుంది. తన దత్తత కుటుంబం కష్టాల్లో ఉన్న విషయం తెలుసుకున్న ఓజీ తిరిగి ముంబైకి రావాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
ఇంతకీ ఈ ఓమి బవు ఎవరు? అతని అసలు లక్ష్యం ఏమిటి? ఓమి కారణంగా సత్య దాదాకు వచ్చిన కష్టాలు ఎలాంటివి? పదేళ్ల తర్వాత తిరిగి వచ్చిన ఓజీ… ఓమిని ఢీకొని గెలవగలిగాడా? తన కుటుంబాన్ని, పోర్ట్‌ను అతడు అన్ని సమస్యల నుంచి కాపాడగలిగాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ OG చిత్రం.
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ సుజీత్ ఈ సినిమా కథ ను ఇటు ముంబై కి అటు జపాన్ కి బాగా సింక్ చేసుకొని రాసుకున్నాడు… ఇక సినిమా స్టార్టింగ్ లో మూవీ కి సంబంధించిన వరల్డ్ ను క్రియేట్ చేయడానికి, ఆ పాత్రలను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది.ఇవన్నీ ప్రాపర్ గా సెట్ చేయడానికి దర్శకుడు కొంత సమయాన్ని తీసుకున్నాడు. ఇక కొంతమందికి స్టార్టింగ్ సీన్స్ కొన్ని బోర్ కొట్టించే అవకాశం అయితే ఉంది. అయినప్పటికి కథని చెబుతున్నాడు కాబట్టి ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా కూర్చొని చూసే ప్రయత్నం కూడా చేశారు…
నిజానికి ఓజీ వరల్డ్ అనేది చాలా పెద్దది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి 30 మినిట్స్ సమయం అయితే తీసుకున్నాడు.ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది…సుజిత్ సైతం సీన్ టు సీన్ ప్రేక్షకుడికి అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేశాడు… స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. ఫస్టాఫ్ లో పవన్ కళ్యాణ్ ఎలివేషన్ కి సంబంధించిన సన్నివేశాలను నడిపిస్తూనే సినిమా కథ బిల్డ్ చేస్తు ముందుకు తీసుకెళ్లాడు…
ఇక జపనీస్ సినిమాల్లో ఎలాంటి స్టైలిష్ మేకింగ్ ఉంటుందో ఈ సినిమాలో కూడా అలాంటి ఒక డిఫరెంట్ మేకింగ్ తో సినిమాని తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశాడు… ఇక ఇంటర్వెల్ కి వచ్చేసరికి సినిమాని టాప్ లెవెల్ కి తీసుకెళ్లి ఇంటర్వెల్ సీన్ తో ఒక హై మూమెంట్ అయితే ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు తనను ఎలాగైతే చూడాలి అనుకున్నారో అలాంటి ఒక రేంజ్ లో పవన్ కళ్యాణ్ ను ఎలివేట్ చేసి చూపించాడు… సెకండాఫ్ పోలీస్ స్టేషన్లో ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ (ఎస్సై) పాత దానికి కొత్త దానికి వేరియేషన్ చెబుతాడు. దానికి పవన్ కళ్యాణ్ మిగతా పోలీస్ ఆఫీసర్స్ తో ఆ ఎస్సై మీద ఎటాక్ చేయించి, తుప్పు పట్టిన కత్తిని తీసుకువచ్చి ఆ ఎస్సై కి కౌంటర్ ఇవ్వడం, అలాగే అందులో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు సెకండ్ హాఫ్ మొత్తానికి హైలైట్ గా నిలిచాయనే చెప్పాలి.
సెకండాఫ్ లో ఈ సినిమాలోని కథని చెబుతూ ఓజీ ముంబై కి డాన్ ఎలా అయ్యాడు అనేది చెప్పారు. ఇక ఓజీ క్యారెక్టర్ కి ఒక రివెంజ్ ను సెట్ చేసి సెకండ్ హాఫ్ లోనే ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఆ సీన్లు కొంచెం డ్రాగయ్యాయి. ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్న సినిమాకి అవి పంటికింది రాయి లా తగిలాయనే చెప్పాలి… నిజానికి అర్జున్ దాస్ ఎపిసోడ్ మొత్తానికి లేకపోయినా పెద్దగా సినిమాకి వచ్చే నష్టమైతే ఏమి ఉండేది కాదు. కావాలనే ఆ సన్నివేశాలను అందులో ఇరికించినట్టుగా అనిపిస్తోంది.
ఇక ఓజీ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయి అతను ముంబై నుంచి వదిలేసి వెళ్లిపోయినట్టుగా కొన్ని సీన్స్ అయితే రాసుకున్నాడు… అవి కొంత వరకు వర్కౌట్ అయ్యాయి…ఇక సుజీత్ ఎమోషన్ ని చాలా వరకు హ్యాండిల్ చేసిన విధానం అయితే బాగుంది. ప్రతి సీన్ లో ఒక కోర్ ఎమోషన్ పట్టుకొని ముందుకు వెళ్ళారు. క్లైమాక్స్ ఎపిసోడ్ కి అయితే థియేటర్లు తగలడిపోతున్నాయనే చెప్పాలి… ఓజి కి ఎలివేషన్ ఇస్తూ క్లైమాక్స్ లో ఆయన కోసం జపాన్ వాళ్ళు రావడం అనేది నిజం గా నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి…
కానీ ఓజీ – ఓమి మధ్య ఒక భారీ ఫైట్ అయితే లేదు. క్లైమాక్స్ లో ఓమి ని చాలా సింపుల్ గా చంపేసినట్టుగా చూపించారు. దీనివల్ల క్లైమాక్స్ ఏదో ఒక తెలియని అసంతృప్తితో ఎండ్ అయింది. హీరోకి, విలన్ కి మధ్య ఒక టగ్ ఆఫ్ వారైతే కనిపించలేదు. అది కనక ప్రాపర్ గా ఉండి ఉంటే సినిమా రేంజ్ మారిపోయేది… ఇక దాంతో పాటు గా సెకండాఫ్ లో హీరో ముంబై కి డాన్ ఎలా అయ్యాడు అనేది ఇంకా బాగా ఒక ఫైట్ రూపంలో ఒక ఎమోషనల్ సన్నివేశాన్ని వాడుకొని దాన్ని బాగా ఎలివేట్ చేసి ఆ పరిస్థితులను క్రియేట్ చేసి దాన్ని విజువల్ గా చూపించి ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తే బాగుండేది…
అలా కాకుండా ఒక క్యారెక్టర్ చేత అవతలి వ్యక్తి తోపు అని చెప్పిస్తే దానివల్ల ఎలివేషన్ అయితే పెద్దగా వర్కౌట్ అయితే కాదు…ఇక ఈ సినిమాలో ఆ తప్పు అయితే జరిగింది. అది భారీ మైనస్ అయింది… ఇక బ్యా గ్రౌండ్ స్కోర్ లో తమన్ చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి సన్నివేశానికి ఒక డిఫరెంట్ బ్యా గ్రౌండ్ స్కోర్ ని అందించే ప్రయత్నం చేశాడు… అలాగే మ్యూజిక్ విషయంలో కూడా ఆయన ఎక్కడ రాజీ పడకుండా చాలా మంచి సాంగ్స్ అయితే ఇచ్చాడు… ఈ సినిమాకి డిఓపి వర్క్ కూడా చాలా వరకు ప్లస్ అయింది. ప్రతి షాట్ లో ఒక కొత్తదనం చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇంట్రాడక్షన్ సీన్ లో కత్తి పట్టుకొని పవన్ కళ్యాణ్ నరుకుతున్నప్పుడు దాన్ని విజువల్గా చాలా బాగా చూపించారు… ఇంటర్ సెల్ సీన్ అయితే గుజ్ బంప్స్ వచ్చాయనే చెల్లి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గత సినిమాల కంటే కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు. ముఖ్యంగా ఆయన పాత్ర కనిపించిన ప్రతిసారి తన నటనతో అందులో ఒక డెప్త్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఆయన ఇంతకుముందు సినిమాల్లో నటించినట్టుగా కాకుండా ఇందులో చాలా సెలెక్టెడ్ గా నటించాడు. తన పాత్ర నుంచి ఎక్కడ డివియెట్ అవ్వకుండా చాలా బాగా నటించాడు…
స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ ను చూస్తున్నంత సేపు ఒక గ్యాంగ్ స్టర్ ను చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఆయన అందులో 100% ఇన్వాల్వ్ అయి నటించాడు. కాబట్టి ఆ ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది… ఇక ఇమ్రాన్ హష్మీ విలన్ గా బాగా సెట్ అయ్యాడు… ఓమి పాత్ర లో కొన్ని మైనస్ గా అనిపించినప్పటికి తమ పాత్రకి నాయక్ చేశాడు…ప్రియాంక మోహన్ కనిపించినవి చాలా తక్కువ సీన్స్ అయినప్పటికి తన పాత్రతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది…
ప్రకాష్ రాజ్ స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అతనిది ఇంపార్టెంట్ క్యారెక్టర్ కావడంతో ఆయన పాత్రకి న్యాయం చేశాడు… శ్రేయ రెడ్డి క్యారెక్టర్ చాలా రెబల్ గా కనిపించింది.ఇప్పటివరకు ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన తక్కువ సినిమాలే అయినప్పటికి మంచి పాత్రలను ఎంచుకొని ఎనలేని గుర్తింపును సంపాదించుకుంటుంది. అర్జున్ దాస్ పాత్ర కి చాలా స్కోప్ అయితే ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన కూడా నటించే మెప్పించడం విశేషం…ఇక మిగిలిన నటీనటులందరు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే తమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. సాంగ్స్ విషయంలోనే కాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్ తో కూడా తన సత్తా చాటుకునే ప్రయత్నం చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ సైతం సినిమా రేంజ్ కు తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాకి ఏమైతే కావాలో అవన్నీ పర్ఫెక్ట్ సమకూర్చారు. అందువల్లే దర్శకుడు ఆ సినిమాని అంత రిచ్ గా తీయగలిగాడు…
ప్లస్ పాయింట్స్
పవన్ కళ్యాణ్ యాక్టింగ్
మ్యూజిక్
విజువల్స్
డైరెక్షన్
మైనస్ పాయింట్స్
సెకండాఫ్ కొంచెం డల్ అయింది…
డైలాగ్స్…
కొన్ని అనవసరమైన సీన్స్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5