OG Movie Pluses And Minuses: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటుడు ఒకప్పుడు వరుస సక్సెస్ లతో బాక్సాఫీస్ మీద దండయాత్ర అయితే చేశాడు. ఇక ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో కొంతవరకు తడబడతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ సినిమా విషయంలో ఆయన చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నాడు. అందువల్లే ఈ సినిమా సగటు ప్రేక్షకుడి మెప్పించింది. ఇక మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రేక్షకులందరు మొత్తం ఈ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంట్రాడక్షన్ సీన్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఇంటర్వెల్ లో ఒక హై మూమెంట్ అయితే ఇచ్చారు. అది ప్రేక్షకుడికి మైండ్ లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది.
ఇక ఇంటర్వెల్ తర్వాత పోలీస్ స్టేషన్ సీన్ , క్లైమాక్స్ సన్నివేశాలు ఈ సినిమా మొత్తానికి ప్లస్ పాయింట్స్ గా మారాయనే చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమా స్టోరీని చాలా డ్రాగ్ చేసి చెప్పారు. అందువల్ల సినిమాలో చాలాసేపటి వరకు మనకు పవన్ కళ్యాణ్ అయితే కనిపించడు. దానివల్ల సినిమా చూసే ప్రేక్షకులకు కొంతవరకు బోరు కలిగించే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక అలాగే సెకండాఫ్ లో ఒక్క హై మూమెంట్ కూడా సరిగ్గా పండలేదు. దానివల్ల సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాత కొంతవరకు ఒక నిరాశ అయితే కలుగుతోంది… ఇక శ్రేయ రెడ్డి లాంటి మంచి నటిని పెట్టుకున్నప్పటికి ఆమె క్యారెక్టర్ ని పూర్తిస్థాయిలో వాడుకోలేదు.
ఆమెను కనుక ఒక లేడీ శివంగి లాగా చూపించినట్టయితే మాత్రం సినిమా మీద ఇంకాస్త ఇంపాక్ట్ అయితే వచ్చేది… అయితే సుజిత్ చాలా డిఫరెంట్ టేకింగ్ తో ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లిన విధానం అయితే బాగుంది. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని వందల కోట్లను వసూలు చేస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…