Pawan Kalyan-NTR: మన టాలీవుడ్ లో హిట్టు/ప్లాప్ తో సంబంధం లేకుండా మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేస్తున్న హీరోలు ఎవరు అని అడిగితె మనకి టక్కుమని గుర్తుకు వచ్చే పేర్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..వీళ్ళ సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్ టాలీవుడ్ లో మరో హీరో కి రావు అనడం లో ఎలాంటి సందేహం లేదు..మొదటి రోజు రికార్డ్స్ లిస్ట్ తీస్తే వీళ్ళిద్దరివే ఉంటాయి.

అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోల సినిమాలు ఒకేరోజు విడుదలైతే ఎలా ఉంటాయి..థియేటర్ల ఓనర్లు అభిమానుల తాకిడిని తట్టుకోగలరా!..ఇప్పటి వరుకు అలా వీళ్లిద్దరి సినిమాలు ఒకే రోజు విడుదల కాలేదు కాబట్టి ఆ యుఫొరియా ఎలా ఉంటుంది అనేది ఎవరికీ అనుభవంలోకి రాలేదు..కానీ అతి త్వరలోనే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ యుఫొరియా క్రేజ్ ని ఎంజాయ్ చెయ్యబోతున్నారు అంటూ టాలీవుడ్ లో ఇప్పుడు ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది.
ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఎలా కొనసాగుతుందో మనం చూస్తూనే ఉన్నాము..పోకిరి , జల్సా రీ రిలీజ్ లు గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో ఈ ట్రెండ్ ఊపందుకుంది..అలా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచినా బద్రి..అలాగే ఎన్టీఆర్ ని స్టార్ హీరో గా నిలబెట్టి ఆయనకీ మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టిన ‘ఆది’ చిత్రాలు ఈ నెల 25 వ తారీఖున విడుదల అవ్వబోతున్నట్టు సమాచారం..పవన్ కళ్యాణ్ మరియు ఎన్టీఆర్ ఫాన్స్ కి ఈ రెండు సినిమాలు కూడా ఎంతో ప్రత్యేకం.

ఈ రెండు సినిమాలను థియేటర్స్ లో మిస్సైన ఫాన్స్ ఎంతో మంది ఉంటారు..అలాంటి అభిమానులందరూ ఈ సినిమాల రీ రిలీజ్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు..వారి కోసం 4K క్వాలిటీ తో నిర్మాతలు ఈ రెండు చిత్రాలను విడుదల చెయ్యబోతున్నారు..మరి ఈ రెండు సినిమాలలో ఏ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వస్తాయో తెలియాలంటే నవంబర్ 25 వ తారీకు వరుకు వేచి చూడాల్సిందే.