
Pawan Kalyan : ఎన్నో ఎదురుచూపుల తర్వాత ఫైనల్ గా వినోదయ సితం రీమేక్ రెగ్యులర్ షూట్ మొదలైంది. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా.. సముద్ర ఖని ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందులో అన్ని కమర్షియల్ హంగులు ఉండేలా చూసుకుంటారు దర్శక నిర్మాతలు.. ముఖ్యంగా పాటలు, ఫైట్లు, హీరోయిన్, రోమాన్స్, యాక్షన్. ఇవన్నీ ఉంటేనే ఆయన అభిమానులు సంతృప్తి పడగలరు.
అయితే ఇవేవీ లేకుండా పవన్ తో సినిమా నడిపించడం చాలా కష్టమన్న భావన ఉంది. అయితే తాజాగా దాన్ని చేసి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘వినోదయ సీతం’ రిమేక్ లో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తున్నాడు. భక్తుడిగా సాయిధరమ్ తేజ్ ఈ పాత్ర పోషిస్తున్నాడు.
దేవుడైన పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా దేవత ఎవరూ లేరు. ఓన్లీ సింగిల్ గాడ్ గానే పవన్ కనిపించనున్నారు. ఇక సాయిధరమ్ తేజ్ కు కూడా హీరోయిన్ ఉంది.
ఇలాంటి సందర్భం ఇదివరకు ఒకసారి వెంకటేశ్ హీరోగా నటించిన మూవీలోనూ వచ్చింది. అందులో కృష్ణుడిగా దేవుడిగా అలరించిన పవన్ కు హీరోయిన్ లేదు. మళ్లీ ఈ సినిమాలోనే అది కనిపిస్తోంది. మరి దీన్ని ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
ఇక మొదటిసారి సాయి ధరమ్ తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్నారు. అందుకే ఈ కాంబినేషన్ మరింత ప్రత్యేకం. ఇద్దరు మెగా హీరోలు కలిసి చేస్తున్న మల్టీస్టారర్. ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే సూచనలు కలవు. అలాగే పవన్ హరి హర వీరమల్లు పూర్తి చేస్తున్నారు. దర్శకుడు సుజీత్, హరీష్ శంకర్ చిత్రాలను పట్టాలెక్కించాల్సి ఉంది .