Pawan kalyan Varuntej Lavanya : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్న కుమారుడు వరుణ్ తేజ్-లావణ్య నిశ్చిత్తార్థానికి లేట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే లేట్ గా అయినా లేటెస్ట్ గానే పవన్ ఎంట్రీ దక్కింది. నిజంగా పవన్ ను చూస్తే ఇదేదో కొత్త సినిమా లుక్ అనిపించకమానదు. బహుశా ‘ఓజీ’ సినిమా కోసం ఇలా హెయిర్ స్టైల్ మార్చాడా? లేదా ఇంకేమైనా త్రివిక్రమ్ సినిమా కోసం ప్లాన్ చేశాడా? అన్నది తెలియదు.
ప్రస్తుతం పవన్ చేతిలో హరిహర వీరమల్లుతోపాటు, ఓజీ, ‘బ్రో’, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలున్నాయి. పవన్ తాజా లుక్ చూస్తుంటే ఇది ఓజీ సినిమా కోసం అని అనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ బ్లాక్ షర్ట్, జీన్స్ లో నాగబాబు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం వరుణ్-లావణ్యలకు పుష్పగుచ్చం అందించి ఎంగేజ్ మెంట్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాగబాబు ఫ్యామిలీతో కలిసి గ్రూప్ ఫొటో దిగాడు.
ఈ ఫొటోలో నిహారిక భర్త లేడు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు మళ్లీ బయటపడ్డట్టు అయ్యాయి.
ఇక పవన్ కళ్యాణ్ ఎంట్రీ, కుటుంబంతో గడిపిన సరదా క్షణాలు ఫొటోలు బయటకు వచ్చాయి. అవి వైరల్ అవుతున్నాయి. పవన్ మాస్ ఎంట్రీ చూస్తే గూస్ బాంబ్స్ ఖాయం.
The “OG Look” that I mentioned. That hairstyle with most stylish costumes..#OG https://t.co/tFzxdI9GqL pic.twitter.com/qt4m2a0hVk
— Trivikram Dialogues (@TrivikramFans) June 10, 2023