Pawan Kalyan Martial Arts Training: పవన్ కళ్యాణ్ ఓ కరాటే మాస్టర్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూడు దశాబ్దాల అనంతరం ఆ వ్యక్తిని కలుసుకున్న పవన్ కళ్యాణ్… ఆయన ఎవరో? ఆయనతో తనకున్న అనుబంధం ఏమిటో? వెల్లడించారు.
View this post on Instagram
పవన్ కళ్యాణ్(PAWAN KALYAN) మల్టీటాలెంటెడ్. నటుడు మాత్రమే కాదు, ఆయన రచయిత, దర్శకుడు, సింగర్ కూడాను. ఇక పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రావీణ్యం ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన పలు చిత్రాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేశారు. హరి హర వీరమల్లు చిత్రంలోని కుస్తీ ఫైట్ కి భారీ ఆదరణ దక్కింది. ఆ చిత్రంలోని హైలెట్స్ లో అది ఒకటిగా ప్రేక్షకులు అభివర్ణించారు. ఆ ఫైట్ ని పవన్ కళ్యాణ్ స్వయంగా కంపోజ్ చేశారు. దీనికి సంబంధించిన మేకింగ్ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి.
కాగా కరాటే అవుట్ ఫిట్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆయనతో పాటు మరో కరాటే మాస్టర్ ని మనం చూడొచ్చు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తో ఉన్న ఆ వ్యక్తి పేరు తిరు రేన్షీ రాజా అట. పవన్ కళ్యాణ్, రాజా ఒకే స్కూల్ లో కరాటే నేర్చుకున్నారు. 1990లలో పవన్ కళ్యాణ్ కరాటే మాస్టర్ షిహాన్ హుసై వద్ద శిక్షణ తీసుకున్నారు. షిహాన్ కోలీవుడ్ నటుడు కూడాను. షిహాన్ స్కూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు రాజా కరాటేలో శిక్షణ తీసుకున్నారు.
Also Read: అప్పుడు బాలయ్యకు ఇప్పుడు పవన్ కి… సేమ్ సీన్ రిపీట్!
ఇక పవన్ కళ్యాణ్ గ్రీన్ బెల్ట్ సాధించిన సమయంలో రాజా బ్లాక్ బెల్ట్ పొందారు అట. 34 ఏళ్ల తర్వాత రాజాను పవన్ కళ్యాణ్ కలిశారు. వారు ఈ స్కూల్ లో శిక్షణ తీసుకున్నారో అదే స్కూల్ ని ఇప్పుడు రాజా విజయవంతంగా నడుపుతున్నాడు అట. అందుకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపాడు. వీరి గురు షిహాన్ ఇటీవల బ్లాక్ క్యాన్సర్ తో కన్నుమూశాడట. అంతపెద్ద స్టార్ అయినప్పటికీ తన మూలాలు మర్చిపోకుండా, ఒకప్పటి మిత్రుడిని కలిశాడు పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. అలాగే నటుడిగా కొనసాగుతున్నారు. హరి హర వీరమల్లు థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన దక్కింది. పవన్ కళ్యాణ్ గతంలో సైన్ చేసిన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కావాల్సి ఉంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ పై భారీ హైప్ ఉంది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్స్ లోకి రానుంది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. తాజాగా ఈ మూవీ క్లైమాక్స్ షూట్ పూర్తి చేశారు.