Pawan Kalyan Health: ఎల్లుండి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ఓజీ(They Call Him OG) చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. అభిమానులు ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రేంజ్ సెలబ్రేషన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతా బాగానే ఉంది కానీ, పవన్ కళ్యాణ్ కి ఈ సమయం తీవ్రమైన వైరల్ ఫీవర్ రావడం ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ కి మొదటి నుండి వైరల్ ఫీవర్ తరచూ వస్తూనే ఉంటుంది. గతం లో కూడా మనం ఇలాంటి వార్తలను చాలానే విన్నాము. వర్షం లో తడిసిన, వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడి నీళ్లు త్రాగిన ఆయనకు చాలా తేలికగా వైరల్ ఫీవర్ సోకుతుంది.
రీసెంట్ గానే హైదరాబాద్ లోని LB స్టేడియం లో ఓజీ(They Call Him OG) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ జరుగుతున్నా సమయం లో పిడుగులతో కూడిన జోరు వాన కురిసిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈవెంట్ ని రద్దు చేయకుండా, అక్కడికి వచ్చిన వేలాది మంది అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ వర్షం లో తడుస్తూనే తన ప్రసంగాన్ని అందించాడు. దీంతో ఆయనకు వైరల్ ఫీవర్ సోకినట్టుగా తెలుస్తుంది. ఆ వైరల్ ఫీవర్ తోనే ఆయన అసెంబ్లీ సమావేశాలు హాజరయ్యాడు అట. అదే విధంగా తన శాఖకు సంబంధించిన అధికారులతో కూడా ఆయన సమీక్షలు నిర్వహించాడట. అయితే సోమవారం రాత్రి జ్వరం తీవ్రత ఇంకా పెరిగిందట. దీంతో చికిత్స అందిస్తున్న వైద్యులు విశ్రాంతి తీసుకోవడం అవసరమని సూచించారట. అయినప్పటికీ కూడా ఆయన అధికారులతో తన శాఖకు సంబంధించిన టెలీ కాన్ఫెరెన్స్ లు నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ విషయం గురించి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది.