Pawan Kalyan Serious About Balakrishna: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక్కడ హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఈ పోటీలో ఏ మాత్రం వెనుకబడిన కూడా తమ తోటి హీరోలు వాళ్లను డామినేట్ చేసి ముందుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు ట్రెండ్ ను అనుసరిస్తూ ఆడియన్స్ కి ఎలాంటి సినిమాలు కావాలో వాటిని అందించే ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడే సక్సెసులు దక్కుతాయి. తద్వారా సినిమా ఇండస్ట్రీలో వాళ్ల స్థానం సుస్థిరం అవుతోంది… నందమూరి నటసింహం గా గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఇప్పటికే మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆయన ఇకమీదట చేస్తున్న సినిమాలతో కూడా వరుస సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ‘అఖండ 2’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది… మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి అతనికి గొప్ప గుర్తింపుని తీసుకొచ్చి పెట్టింది…ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ 2024 ఎలక్షన్స్ లో భాగంగా బిజెపి, తెలుగుదేశం పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అలాగే గవర్నమెంట్ ను కూడా ఫామ్ చేశారు.
ఇక రీసెంట్ గా బాలయ్య బాబు అసెంబ్లీ వేదికగా చిరంజీవిని అవమానిస్తూ కొన్ని ఘాటు వ్యాఖ్యలైతే చేశాడు. దానిమీద పవన్ కళ్యాణ్ ఎలాంటి స్పందనను తెలియజేయనప్పటికి బాలయ్య బాబు మీద కొంతవరకు కోపంతో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి… నిజానికి చిరంజీవిని ఎవరు ఏ ఒక్క చిన్న మాట అన్న కూడా పవన్ కళ్యాణ్ తట్టుకోలేడు.
గతంలో మోహన్ బాబు చిరంజీవిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలకు పవన్ కళ్యాణ్ కౌంటర్ వేస్తూ కొన్ని ఘాటు వ్యాఖ్యలైతే చేశాడు. ఇప్పుడు అదే ధోరణిలో బాలయ్య బాబు మీద కొంచెం సీరియస్ గా ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లంతా మళ్ళీ ఎప్పుడు కలిసిపోయి పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…