Pawan Kalyan And Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యంత స్టైలిష్ లుక్ లో కనిపించిన సినిమా ‘ఓజీ’… గతంలో ఆయన చేసిన ‘పంజా’ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపించిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాను సక్సెస్ తీరాలకు చేర్చాలేకపోయాడు. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఓజీ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం చేశాయి. కానీ ఓజీ సినిమాతో ఆయన పరిధి ప్రాంతాలను దాటి ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ‘ఏ కార్యాన్నైనా చేయగలిగే సత్తా ఉన్నోడిని ఆపడం ఎవరి వల్ల కాదు’ అనే మాటను మరోసారి ప్రూవ్ చేసి చూపించిన నటుడు పవన్ కళ్యాణ్…ఈయన తన కెరియర్ లో చేసిన సినిమాలు గొప్ప విజయాలను సాధించాయి. ఆయన ప్రస్తుతం సినిమాలపరంగా కొంతవరకు వెనుకబడినప్పటికి పాలిటిక్స్ మీద తన పూర్తి ఫోకస్ ని కేటాయించాడు. ఇక ఈ క్రమం లోనే అడపదడప సినిమాలు చేస్తునే గొప్ప విజయాలను సాధిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు చేస్తూనే, ఇటు సినిమాలను కూడా కంటిన్యూ చేయాలనినే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ఓజీ సినిమా 343 కోట్ల కలెక్షన్లకు మించి భారీ వసూళ్లను రాబడుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. తన కొడుకు అయిన అఖిరా నందన్ ఓజీ సినిమాకి సంబంధించిన ఒక డౌట్ అడిగాడట.
సినిమాలో పవన్ కళ్యాణ్ రైట్ హ్యాండ్ గా ఉన్న హరీష్ ఉత్తమన్ ఎలా బతుకుతాడు, ఆయన జీవనశైలి ఏంటి అతన్ని సినిమాలో ఎందుకు చంపేశారు అంటూ కొన్ని కామెంట్లు చేశారట. దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెబుతూ ఈ మూవీ దర్శకుడు సుజీత్ హరీష్ ఉత్తమన్ ను హీరో పక్కన చాలా స్ట్రాంగ్ గా చూపిస్తూనే తన క్యారెక్టర్ ను ఎలివేట్ చేశాడు.
ఆ రేంజ్ లో తనను చూపించినప్పుడు అతను చనిపోతేనే అందులో ఎమోషన్ వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతో డైరెక్టర్ అతన్ని చంపేశాడు. దీనికి మొత్తం బాధ్యత దర్శకుడు తీసుకుంటాడు అంటూ అఖిరా నందన్ కి పవన్ కళ్యాణ్ ఒక కన్ క్లూజన్ ఇచ్చాడట… మొత్తానికైతే పవన్ కళ్యాణ్ రీసెంట్గా ఈ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్నప్పుడు అఖిరా అడిగిన ఈ ఫన్నీ డౌట్ ని ప్రేక్షకుల చేత పంచుకున్నాడు.
మొత్తానికేతే సినిమాల మీద అఖిరా కి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఈ ఒక్క సంఘటన ద్వారా అందరికీ తెలిసేలా చేశారు. ఇక మరో రెండు సంవత్సరాల్లో అఖిరా నందన్ హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం అవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి…