Alitho Saradaga- Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మనకి వెంటనే గుర్తుకు వచ్చే వాళ్లలో ముందుగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ – అలీ స్నేహం గురించి..వీళ్లిద్దరి స్నేహం నిన్న మొన్నటిది కాదు..పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణం ప్రారంభమైనప్పటి నుండి వీళ్ళ స్నేహం కొనసాగుతూనే ఉంది..అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుండి కాటంరాయుడు సినిమా వరుకు వీళ్లిద్దరి కాంబినేషన్ కొనసాగుతూ వచ్చింది..అజ్ఞాతవాసి, వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ లోనే వీళ్ళ కాంబినేషన్ మిస్ అయ్యింది..అయితే ఇంతమంచి స్నేహితులిద్దరి మధ్య రాజకీయం చిచ్చు పెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే.

అలీ జనసేన పార్టీ లో కాకుండా వైసీపీ పార్టీ లో చేరడం పై అప్పట్లో పవన్ కళ్యాణ్ విమర్శలు కూడా చేసాడు..ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి కౌంటర్ గా అలీ కూడా రెస్పాన్స్ ఇచ్చారు..అప్పట్లో ఇది పెద్ద దుమారమే రేపింది..మళ్ళీ వీళ్లిద్దరు కలుస్తారా..కలిసి సినిమాలు చేస్తారా అనే సందేహం అభిమానుల్లో ఉండేది..ఇటీవల పలు ఇంటర్వూస్ లో అలీ ని ఇదే ప్రశ్న అడగగా కచ్చితంగా సినిమా చేస్తాము..మా మధ్య స్నేహం ఎప్పటికి అలాగే ఉంటుంది అని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మరో వార్త ఏమిటి అంటే అలీ యాంకర్ గా ఈటీవీ లో ప్రతి సోమవారం ప్రసారమయ్యే ‘అలీ తో సరదాగా’ ప్రోగ్రాం కి ముఖ్య అతిధిగా అతి త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడని తెలుస్తుంది..ఇటీవలే పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా కలిసి అలీ అడగగా పవన్ కళ్యాణ్ పాజిటివ్ గానే రెస్పాన్స్ ఇచ్చాడట..అలీ తో సరదాగా చివరి ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి గా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి..ఈ ప్రోగ్రాం కి ఇప్పటి వరుకు ఎంతో మంది లెజెండ్స్ వచ్చి ఇంటర్వూస్ ఇచ్చారు.

అలా మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ ప్రోగ్రాం పవన్ కళ్యాణ్ రాక తో TRP రేటింగ్స్ పరంగా మరో లెవెల్ కి వెళ్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఇప్పటి వరుకు పవన్ కళ్యాణ్ ఇలాంటి టాక్ షోస్ కి హాజరు అయ్యింది లేదు..మొట్టమొదటిసారి అలాంటి షో కి హాజరు కాబోతున్నాడు అని వార్తలు రావడం తో సోషల్ మీడియా మొత్తం సెన్సషనల్ టాపిక్ గా మారిపోయింది.