Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకొని ఎదురు చూస్తున్న చిత్రం #OG. ప్రముఖ యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ ఆయుధాలను జపాన్ కి సరఫరా చేసే బొంబాయి పోర్ట్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు.
శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, అప్పుడే 50 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందట. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఒక మైలు రాయిగా నిలిచిపోయే చిత్రం గా మిగులుతుందని, అభిమానులు చిరకాలం గుర్తుంచుకొని గర్వంగా చెప్పుకునే స్థాయిలో స్క్రిప్ట్ ఉంటుందని అంటున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉండబోతుంది అట.
ఇది ఇలా ఉండగా లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, ఇందులో పవన్ కళ్యాణ్ ఒక సన్నివేశం లో చొక్కా లేకుండా కనిపిస్తాడట. పవన్ కళ్యాణ్ ని చొక్కా లేకుండా చూపించాలనే ఆలోచన డైరెక్టర్ కి ఎలా వచ్చింది?, ఆయన మిగతా హీరోలు లాగ సిక్స్ ప్యాక్ లాంటివి ఏమి చెయ్యదు కదా, మరి ఇది ఎలా సాధ్యం అని అభిమానులకు సందేహం రావొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ని ఆయన ఇందులో సిక్స్ ప్యాక్ బాడీ తోనే చూపిస్తాడట. అందుకోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వర్కౌట్స్ కూడా అతి త్వరలోనే ప్రారంభించబోతున్నాడట.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కొత్త షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. ఈ షెడ్యూల్ పూర్తి అవ్వగానే ఆయన ‘వారాహి విజయ యాత్ర’ రెండవ విడత ని ప్రారంభించబోతున్నాడు. ఇది పూర్తి అయినా తర్వాతే #OG కొత్త షెడ్యూల్ ఉంటుంది. ఇక 30 రోజుల డేట్స్ ఇస్తే #OG మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందట, డిసెంబర్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.