Guntur Kaaram: టాలీవుడ్ లో అతి పెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలు పవన్ కళ్యాణ్-మహేష్ బాబు. టాక్ తో సంబంధం లేకుండా వీరి చిత్రాలకు భారీ ఆదరణ ఉంటుంది. అలాంటి వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ చేయాలనే డిమాండ్ ఉంది. ముఖ్యంగా వీరి కామన్ ఫ్యాన్స్ చాలా కాలంగా కోరుకుంటున్నారు. కొందరు దర్శకులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో వెంకటేష్ పాత్రకు పవన్ కళ్యాణ్ ని అనుకున్నారట. ఇటీవల ఆయన స్వయంగా చెప్పారు.
కారణాలు ఏమైనా అది సాకారం కావడం లేదు. అయితే గుంటూరు కారంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ఎంట్రీ ఉంటుందనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే డైరెక్ట్ గా కాదట. మహేష్ పాత్రకు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఉంటుందట. ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ కి అత్యంత సన్నిహితుడు. త్రివిక్రమ్ కోరితే పవన్ కళ్యాణ్ కాదనరు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని ఒప్పించి గుంటూరు కారంలో మహేష్ ఎంట్రీ సీన్ కి వాయిస్ ఓవర్ చెప్పించారట. గతంలో త్రివిక్రమ్ ఈ ప్రయోగం ఆల్రెడీ చేశాడు. పవన్ కళ్యాణ్ జల్సా చిత్రంలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సంజయ్ సాహు గురించి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఆ సినిమాకు ప్లస్ అయ్యింది. రివర్స్ లో అదే ప్రయత్నం మరోసారి రిపీట్ చేస్తున్నారు అంటున్నారు. మరి చూడాలి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో..
గుంటూరు కారం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ నుండి పూజ హెగ్డే తప్పుకోగా శ్రీలీల మెయిన్ లీడ్ చేస్తుంది. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.