Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Health Update: పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పై సతీమణి అన్నా లెజినోవా...

Pawan Kalyan Health Update: పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పై సతీమణి అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్..

Pawan Kalyan Health Update: ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) శుక్రవారం రోజున ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్న సమయం లో, తీవ్రమైన అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో చేరడం , ఆయనకు అత్యవసరంగా ఒక సర్జరీ చేయడం, డాక్టర్లు వారం నుండి 10 రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించడం , పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని చెప్పడం వంటివి అభిమానులు తీవ్రమైన ఆందోళనకు గురి చేసింది. పవన్ కళ్యాణ్ కి సర్జరీ చేసేంత పరిస్థితి ఎందుకు వచ్చింది?, అసలు ఆయనకు ఏమైంది అంటూ అభిమానులు కంగారు పడుతూ తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. మా ఆరాధ్య దైవం త్వరగా కోలుకోవాలి అంటూ దేవుడిని ప్రార్థిస్తూ పోస్టులు వేశారు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఆయన పరిస్థితి పై పెట్టిన ఒక స్టోరీ ని చూసిన తర్వాత పవన్ ఫ్యాన్స్ శాంతించారు.

ఆమె మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. చాలా వేగంగా కోలుకుంటున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె ఈ స్టోరీ పెట్టక ముందు వరకు కూడా సోషల్ మీడియా లో పవన్ అభిమానుల్లో తీవ్రమైన ఆందోళనకర వాతావరణం ఉండేది. ఇంతకీ అసలు పవన్ కళ్యాణ్ కి ఏమైంది?, సర్జరీ ఎందుకు చేశారు అనేది మాత్రం బయటకు రాలేదు. కొన్ని మీడియా చానెల్స్ లో పైల్స్ వచ్చాయని , ముక్కుకు సర్జరీ జరిగిందని అంటుంటే , మరి కొన్ని మీడియా చానెల్స్ లో చాలా కాలం నుండి ఆయన బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడుతున్నాడు , అందుకు సంబంధించిన సర్జరీ జరిగిందని అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం , ఏది అబద్దం అనేది తెలియడం లేదు, స్వయంగా జనసేన పార్టీ హ్యాండిల్ నుండి చెప్తే కానీ , అసలు ఏ విషయం లో సర్జరీ జరిగిందో తెలియదు.

పవన్ కళ్యాణ్ కొమరం పులి మూవీ సమయం నుండి ఈ బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. బాగా గమనిస్తే , ఒక్క మీటింగ్ లో కూడా ఆయన నాన్ స్టాప్ గా రెండు గంటలు కూర్చోలేడు . ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే , టాబ్లెట్స్ వేసుకొని కూర్చోవాల్సిందే, అందుకే సినిమాల్లో కూడా భారీ ఫైట్ సన్నివేశాలు గత 12 ఏళ్ళ నుండి చేయడం లేదు. మరి ఈ సర్జరీ తర్వాత బ్యాక్ పెయిన్ కి శాశ్వత పరిష్కారం దొరికినట్టేనా?, లేకపోతే ఇంకా కొన్ని రోజులు ఇబ్బంది పడాల్సిందేనా అనేది తెలియాల్సి ఉంది .

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version