Homeఆంధ్రప్రదేశ్‌Modi Tweet On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పై ప్రధాన మంత్రి...

Modi Tweet On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంచలన ట్వీట్..

Modi Tweet On Pawan Kalyan: నిన్నటి నుండి సోషల్ మీడియా లో ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కి జరిగిన కీలక సర్జరీ కి సంబంధించి , జాతీయ స్థాయిలో ఏ స్థాయి చర్చ జరిగిందో మనమంతా చూస్తున్నాం. ముఖ్యంగా అభిమానులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రోజున పవన్ కళ్యాణ్ ప్రభుత్వ అధికారులతో కొన్ని కీలక చర్చలు చేస్తున్న సమయం లో తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఆయన్ని వెంటనే హాస్పిటల్ కి తరలించగా, అక్కడ డాక్టర్లు సర్జరీ అత్యవసరంగా చెయ్యాలని చెప్పడం , ఆ తర్వాత విజయవంతంగా సర్జరీ ని పూర్తి చేయడం వంటివి జరిగింది. సర్జరీ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ హాస్పిటల్ నుండి బయటకు వస్తున్న వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే పవన్ ఆరోగ్య పరిస్థితి పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఒక ట్వీట్ వేశాడు.

ఆయన మాట్లాడుతూ ‘కాసేపటి క్రితమే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఫోన్ మాట్లాడాను. అతని ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నాను. పవన్ కళ్యాణ్ చాలా ధైర్యవంతుడు అనే విషయం నాకు తెలుసు, కచ్చితంగా ఆయన త్వరగా కోలుకొని మన ముందుకొస్తాడు. ఆయనకు మంచి ఆరోగ్యం దక్కాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు నరేంద్ర మోడీ. సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్న ఈ ట్వీట్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ప్రధాన మంత్రి ఈ ట్వీట్ వెయ్యడం తో అభిమానుల్లో మామూలు ఆనందం కలగలేదు. పవన్ కళ్యాణ్ కి నరేంద్ర మోడీ కి మధ్య ఎంత గొప్ప సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, 2014 నుండి ఒకరిని ఒకరు ఎంతో గౌరవించుకుంటూ వచ్చారు.

2024 ఎన్నికల్లో సంచలన విజయం పొందిన తర్వాత పార్లమెంట్ లో ‘ఇతను పవన్ కళ్యాణ్ కాదు , తుఫాన్’ అంటూ సంబోధించడం అప్పట్లో సెన్సేషనల్ టాపిక్ గా నిల్చింది. ఎందుకంటే ఆరోజు సభలో దేశానికీ చెందిన ముఖ్యమంత్రులు , మంత్రులు, ఎంపీ లు , రాజ్య సభ సభ్యులు , ఇలా ఎంతో మంది ఉన్నారు. కానీ ఎవ్వరికీ ఇవ్వనంత ఎలివేషన్ పవన్ కళ్యాణ్ కి నరేంద్ర మోడీ ఇచ్చాడు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, మోడీ పవన్ కి ఏ స్థాయి ప్రాధాన్యత ఇస్తాడు అనేది. అందుకే ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వెంటనే ఫోన్ చేసి ఆరాలు తియ్యడమే కాకుండా, ట్విట్టర్ లో ట్వీట్ కూడా వేశారు. ప్రధాని ట్వీట్ కి క్వాట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కూడా రెస్పాన్స్ ఇచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version