Pawan Kalyan Hari Hara Veeramallu Dubbing: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రం ఎట్టకేలకు జూన్ 12 న విడుదల కాబోతుంది. సినిమా విడుదలకు సరిగ్గా రెండు వారాల సమయం ఉండడంతో మేకర్స్ చకచకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షూటింగ్ కోసం ముంబై లో ఉంటున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి పది గంటల వరకు షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, ఆ తర్వాత ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి, ట్రైలర్ కి డబ్బింగ్ మొత్తం పూర్తి చేసాడు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే కేవలం నాలుగు గంటల్లోనే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసాడట పవన్ కళ్యాణ్. సాధారణంగా ఏ హీరో అయినా డబ్బింగ్ కార్యక్రమాలు కోసం నాలుగు రోజుల సమయం కేటాయిస్తారు.
కొంతమంది అయితే కేవలం ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన డబ్బింగ్ ని పూర్తి చేయడానికి నాలుగు రోజుల సమయం తీసుకుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం నాలుగు గంటల్లో డబ్బింగ్ పూర్తి చేయడం నిజంగా రికార్డు అనే చెప్పాలి. కేవలం ఈ ఒక్క సినిమాకు మాత్రమే కాదు, ఏ సినిమాకి అయినా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకోడట. వకీల్ సాబ్ చిత్రానికి కేవలం ఆరు గంటల సమయం మాత్రమే తీసుకున్నాడట. ఆ చిత్రం లో డైలాగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పేజీల పేజీల డైలాగ్స్ కి అంత తక్కువ సమయంలో పూర్తి చేయడం మామూలు విషయం కాదు. మరో ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏమిటంటే ‘బ్రో’ చిత్రానికి ఆయన కేవలం రెండు గంటల్లో డబ్బింగ్ పూర్తి చేసాడట. అంత స్పీడ్ గా చెప్పాడు కదా, క్వాలిటీ మిస్ అవుతుందేమో అని అనుకుంటే పెద్ద పొరపాటే.
పర్ఫెక్ట్ క్వాలిటీ తో నార్మల్ గా ఇతర హీరోల సినిమాలకు ఎలాంటి డబ్బింగ్ ఉంటుందో, పవన్ కళ్యాణ్ గత చిత్రాలకు కూడా అదే రేంజ్ డబ్బింగ్ ఉంటుంది. సన్నివేశాలు కూడా పవన్ కళ్యాణ్ సింగల్ టేక్ లోనే చేసేస్తాడట. ఆయన కెరీర్ లో అత్యధిక టేక్స్ తీసుకున్న సన్నివేశాలు చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు. ఇలా ఏదైనా అత్యంత వేగంగా పూర్తి చేయడం అనేది పవన్ కళ్యాణ్ లో ఉన్నటువంటి ప్రత్యేకమైన క్వాలిటీ. మరి ‘హరి హర వీరమల్లు’ చిత్రం లో ఆయన ఎలాంటి డైలాగ్స్ కొట్టాడో, ఆయన ఏ రేంజ్ యాక్షన్ చేసాడో చూడాలంటే మరో రెండు వారాలు ఆగాల్సిందే. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూన్ 2 న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి కానీ, జూన్ 4న కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఇది ఎంత వరకు నిజం అవ్వుద్ది అనేది.
Power Star @PawanKalyan garu wraps dubbing for #HariHaraVeeraMallu with unstoppable focus & fire! ⚡️
Despite a packed schedule, he began dubbing at 10 PM after wrapping his shoot and completed the entire dubbing in just 4 hours.
Get ready for the power storm! ️
An… pic.twitter.com/UoKpop27eb— Hari Hara Veera Mallu (@HHVMFilm) May 29, 2025