Pawan Kalyan : కరాటీ మాస్టర్, ప్రముఖ నటుడు షిహాన్ హుస్సేన్(Shihan Hussaini) నేడు కన్ను మూసాడు. గత కొంత కాలంగా లుకేమియా వ్యాధితో బాధపడుతున్న ఆయన కొద్దిరోజుల క్రితమే చెన్నైలోని ఒక హాస్పిటల్ లో చేరారు. కొన్ని రోజులు చికిత్స తీసుకున్న ఆయన, నేడు తన తుదిశ్వాసని వదిలాడు. ఆయన ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు చాలా వరకు గట్టి ప్రయత్నం అయితే చేసారు కానీ, చివరికి విఫలమయ్యారు. షిహాన్ హుస్సేన్ మన టాలీవుడ్ లో ఇప్పట్టి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ, ఈయన ఎంతో మంది ప్రముఖ నటులకు కరాటీ నేర్పించాడు. వారిలో మన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి ఈయన కరాటీ, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ వంటివి నేర్చుకున్నారు. ఇతని వద్ద శిక్షణ తీసుకుంటేనే పవన్ కళ్యాణ్ బ్లాక్ బెల్ట్ ని సాధించాడు.
Also Read : పవన్ కి పెద్ద తలనొప్పిగా మారిన నాగబాబు..టీడీపీ, వైసీపీ ఏకం అయ్యాయిగా!
ఇతనికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంటే ఎంతో అభిమానం. ఒక విధంగా చెప్పాలంటే ఆమె భక్తుడు. ఒక సినీ నటుడు, కరాటీ ట్రైనర్ కంటే ఈయన జయలలిత అభిమాని గానే ప్రపంచానికి ఎక్కువ మందికి తెలుసు. ఇండస్ట్రీ లో ఈయన దశాబ్దాల క్రితం నుండే సినిమాలకు స్టంట్ మాస్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టాడు కానీ, వెండితెర పై కనిపించింది మాత్రం 1986 వ సంవత్సరం లో కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పున్నగై మన్నన్’ అనే చిత్రం ద్వారానే. ఈ సినిమా తర్వాత ఆయన ‘వేలైక్కారన్’ అనే చిత్రం లో నటించాడు. ఆ తర్వాత ఏకంగా ఆయనకు ‘బ్లడ్ స్టోన్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. అలా అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆయన తమిళం లో మొత్తం కలిపి 10 సినిమాలలో నటించాడు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘తమ్ముడు’.
ఈ సినిమాని తమిళంలో హీరో విజయ్(Thalapathy Vijay) ‘బద్రి’ పేరుతో రీమేక్ చేసాడు. తెలుగు లో ఎలా ఉందో తమిళం లో కూడా అలాగే మక్కీ కి మక్కీ దింపేశారు. తెలుగు లో పవన్ కళ్యాణ్ కి గురువు పాత్రలో కనిపించిన సూర్య పాత్ర ని తమిళం లో షిహాన్ హుస్సేన్ చేసాడు. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈయన చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘చెన్నై సిటీ గ్యాంగ్ స్టర్స్’. గత ఏడాది ఈ చిత్రం విడుదలై మిశ్రమ ఫలితాన్ని దక్కించుకుంది. గత ఏడాది వరకు ఆయన యాక్టీవ్ గా ఉంటూ సినిమాలు చేసే స్థితిలో ఉన్న సమయం లో ఇలా తీవ్రమైన అనారోగ్యానికి గురై కన్ను మూయడం అందరినీ తీవ్రమైన దిగ్బ్రాంతికి గురి చేసింది. కాసేపటి క్రితమే షిహాన్ శిష్యుడు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేసారు. ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని ప్రార్థిద్దాం.
Also Read : సనాతనం ఎఫెక్ట్ : ఇఫ్తార్ విందుకు పవన్ దూరం