Pawan Kalyan Friends: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియాలో మన స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలన్నీ పెను సంచనాలను క్రియేట్ చేస్తుండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు స్టార్ హీరోలు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో తెచ్చుకుంటున్నారు. పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేయడంతో ఇప్పటివరకు ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ స్థాయిలో కొనసాగుతుంది. ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక పవన్ కళ్యాణ్ తో ఫ్రెండ్షిప్ చేసి ఇండస్ట్రీలో చాలా మంది నటులుగా స్థిరపడ్డారు. ముఖ్యంగా బండ్ల గణేష్, ఉత్తేజ్ లాంటి నటులు మొదట్లో పవన్ కళ్యాణ్ తో చాలా మంచి ఫ్రెండ్స్ గా కొనసాగారు. వీళ్ళ మధ్య చాలా మంచి బాండింగ్ ఉండేది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి పవన్ కళ్యాణ్ తోనే పలు సినిమాలు చేసి సూపర్ సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేష్ ఓవర్ నైట్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో బండ్ల గణేష్ కి తిరుగులేకుండా పోయింది.
ఇక పవన్ కళ్యాణ్ మీద ఎప్పటికప్పుడు కృతజ్ఞతలు చూపిస్తూ వస్తున్న గణేష్ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కి చాలా దూరం అయిపోయాడు. కారణం ఏదైనా కూడా వీళ్ళిద్దరు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని వాళ్ళ సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి…
పవన్ కళ్యాణ్ ద్వారా నష్టపోయిన వారు ఎవరు అంటే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల కేవలం అతని సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తాడేమో మన సినిమాలకు చేయడేమో అనే ఉద్దేశ్యంతో కొంతమంది స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఆనంద్ సాయిని ఆర్ట్ డైరెక్టర్ గా తీసుకోవడం లేదంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి.
నిజానికి ఆనంద్ సాయి చాలా మంచి ఆర్ట్ డైరెక్టర్ ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. పవన్ కళ్యాణ్ లాంటి స్నేహితుడు ఉండటం నిజంగా తన అదృష్టం అంటూ ఆనంద్ సాయి పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్ వల్లే తను ఆర్ట్ డైరెక్టర్ గా మారానని కూడా గుర్తు చేసుకుంటాడు…
