Pawan Kalyan And Balakrishna: నందమూరి నటసింహంగా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు… కెరియర్ మొదటి నుంచి కూడా ఆయన మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ఆయన నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకులతో పాటు సినిమా సెలబ్రిటీలు సైతం ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు… అలాంటి బాలయ్య బాబు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్లను సాధిస్తున్నాడు. బోయపాటి డైరెక్షన్లో చేసిన ‘అఖండ 2’ ను మినహాయిస్తే అంతకుముందు చేసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ కావడం విశేషం. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాని 2027 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు… ఇక బాలయ్య బాబు కి మెగా హీరో అయిన పవన్ కళ్యాణ్ కి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో కలిసి కనిపించారు. అలాగే ఇప్పుడు టిడిపి జనసేన పార్టీ పొత్తులో ఉండటం వల్ల తరచుగా పాలిటిక్స్ గురించి చర్చించుకుంటున్నారు.
నిజానికి వీళ్ళిద్దరూ స్ట్రైట్ ఫార్వార్డ్ గా ఉంటారు. ఏదైనా నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని చెబుతుంటారు. అందువల్లే వీళ్ళిద్దరి టేస్ట్ కలిసి చాలా రోజుల నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. బాలయ్య బాబు సినిమాలంటే తనకు చాలా ఇష్టమని ఆయన అన్ని సినిమాలను చూస్తానని గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.
అలాగే సమరసింహారెడ్డి సినిమా అంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమని, అందులో బాలయ్య బాబు తన పూర్తిస్థాయి నటనను చూపించాడని అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని తెలియజేశాడు. ఇక సమర సింహారెడ్డి సినిమాని తను ఇప్పటివరకు 72 సార్లు చూశానని తన సన్నిహితుల దగ్గర తరచుగా చెబుతూ ఉంటారట. ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు ఒక్క సినిమాని పవన్ కళ్యాణ్ అన్ని సార్లు రిపిటెడ్ గా చూడడం అనేది మామూలు విషయం కాదు…