Kushi Re Release Last Day Records: పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు ఎంత ప్రాణమో రీసెంట్ గా రీ రిలీజ్ అయినా ఖుషి మూవీ మేనియా చూస్తే అందరికి అర్థం అవుతుంది..అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ తో ఎలా అయితే చెడుగుడు ఆడుకుందో, ఇప్పుడు కూడా ఈ సినిమా రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది..మొదటి రోజు ఈ చిత్రానికి దాదాపుగా నాలుగు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇది ఆల్ టైం ఇండియన్ రికార్డు.

ఇక రెండవ రోజు కూడా కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి మరో అల్ టైం రికార్డు నెలకొల్పింది..ఇక వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది..చాలా చోట్ల సాయంత్రం , రాత్రి ఆటలు హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి..కొత్త సినిమాలే సరిగా ఆడని ఈరోజుల్లో, 20 ఏళ్ళ క్రితం విడుదలైన ఒక సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇక ఈ సినిమా కొన్ని ప్రధాన సెంటర్స్ లో ఈ వీకెండ్ చివరి ఆట అవ్వబోతుంది..ఫ్యాన్స్ ఈ చివరి ఆటలను కూడా ఒక పండుగ లాగ జరుపుకోనున్నారు..ముఖ్యంగా హైదరాబాద్ లోని RTC క్రాస్ రోడ్స్ లో ఉన్న దేవి థియేటర్ లో రేపు రాత్రి 9 గంటల 15 నిమిషాల ఆట చివరి ఆట..ఈ షో కి ఫ్యాన్స్ మరోసారి వెళ్లి సెలెబ్రేషన్స్ గ్రాండ్ రేంజ్ లో ప్లాన్ చెయ్యాలని చూస్తున్నారు..ఇప్పటికే ఆ షో కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా దాదాపుగా హౌస్ ఫుల్ రేంజ్ కి వచ్చేసింది.

ఈ షో హౌస్ ఫుల్ అయితే మిగిలిన మూడు షోస్ ని కూడా హౌస్ ఫుల్ చేసే ఆలోచనలో ఉన్నారు ఫ్యాన్స్..అలా మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఈ సినిమాని అభిమానులు ఒక పండుగ లాగ జరుపుకుంటున్నారు..ఇప్పటివరకు ఈ సినిమా 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ఫుల్ రన్ లో కచ్చితంగా పది కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.