Pawan Kalyan fans target Harish Shankar: రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan ) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇలాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ వస్తుందని కలలో కూడా ఊహించలేదని, అది కూడా ‘ఓజీ’ లాంటి భారీ హిట్ తర్వాత ఇలాంటి సినిమా రావడం దురదృష్టకరమని అభిమానులు సోషల్ మీడియా లో విచారం వ్యక్తం చేస్తూ పోస్టులు వేస్తున్నారు. మరోపక్క డైరెక్టర్ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేసి తిడుతున్నారు కూడా. నీతో ప్రస్తుతం టయర్ 2 హీరోలు కూడా సినిమాలు చేసేందుకు సిద్ధంగా లేరని , అలాంటి నీతో పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమా చేస్తే ఎంత జాగ్రత్త గా చెయ్యాలి?, కానీ నువ్వు చాలా నిర్లక్ష్యం చేసావు అంటూ హరీష్ శంకర్ పై మండిపడుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో ఇప్పుడు ఒక ఫన్నీ పోస్ట్ తెగ వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ అభిమానులు, హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి థియేటర్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి సంబంధించిన స్పెషల్ షోని నేడు సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ షో కి హీరోయిన్స్ శ్రీలీల , రాశీ ఖన్నా లతో పాటు, డైరెక్టర్ హరీష్ శంకర్ ని కూడా ఆహ్వానించారు. ఫ్లాప్ సినిమాకు స్పెషల్ షో ని ఏర్పాటు చేయడం ఏంటి?, ఆ షో కి మూవీ టీం ని కూడా ఆహ్వానించడం ఏంటి?, ఇదేదో వీళ్లందరినీ అభిమానులు రౌండప్ చేసి కుమ్మే ప్లాన్ లాగా ఉందే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. క్రింద అందిస్తున్న ట్వీట్ కి చాలా క్వాట్స్ వచ్చాయి. అవి చూస్తే నవ్వు ఆపుకోలేరు, ఒకసారి చూడండి.
మరి హీరోయిన్స్ అయితే ఈ స్పెషల్ షో కి నేడు వస్తున్నారు, మరి డైరెక్టర్ హరీష్ శంకర్ వస్తున్నాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ వస్తే నిజంగానే ఫ్యాన్స్ రియాక్షన్స్ అలా ఉంటుందా ?, లేదా ఎప్పటి లాగానే సరదాగా ఎంజాయ్ చేసి వెళ్తారా అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ అభిమానులు గత ఏడాది డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ‘హరి హర వీరమల్లు’ కి కూడా ఇలాగే పలు ప్రాంతాల్లో స్పెషల్ షోస్ ని ఏర్పాటు చేశారు. వాళ్లకు ప్రతీ సినిమాకు ఇలా స్పెషల్ షోస్ ఏర్పాటు చేయడం అలవాటు అని , కాబట్టి సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదని, అది కేవలం ఫన్నీ కామెంట్స్ అని అంటున్నారు.
#PawanKalyan fans are organizing a special success celebration show of #UstaadBhagatSingh at Sairam Theatre, Malkajgiri on March 28 and have invited their cult captain #HarishShankar to the show – feels like some sketch
— Daily Culture (@DailyCultureYT) March 26, 2026