Pawan Kalyan : ఈ ఏడాది పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఈ ఏడాది ఆయన నుండి ఒక్క సినిమా అయినా విడుదల అవుతుందా అని అందరు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఓపిక చేసుకొని ఆయన రీసెంట్ గానే ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రాన్ని పూర్తి చేసాడు. ఈ సినిమా విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ వారం లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆయన హీరో గా నటిస్తున్న మరో చిత్రం ‘ఓజీ'(They Call Him OG) షూటింగ్ కూడా నిన్ననే మొదలైంది. తాడేపల్లి లో పవన్ కళ్యాణ్ లేని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రేపటి నుండి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. జూన్ 10 లోపు ఈ చిత్రాన్ని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
Also Read : నేటి నుండి ఓజీ షూటింగ్ ప్రారంభం..పవన్ సెట్స్ లోకి అడుగుపెట్టేది ఆరోజే!
ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదే విడుదల అవ్వబోతున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ఇక చేదు వార్త ఏమిటంటే, ఈ ఏడాది ఆయన పుట్టినరోజు కి ఎలాంటి రీ రిలీజ్ సినిమా ఉండదు. ప్రతీ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తుంటారు. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వస్తూ ఉంటుంది. ఈ ఏడాది ఆ ఛాన్స్ లేనట్టే. ఎందుకంటే ఆయన హీరో గా నటిస్తున్న ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 5 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2 అనేది మన అందరికీ తెలిసిందే. ఓజీ చిత్రం విడుదలకు కేవలం రెండు మూడు రోజుల ముందు రీ రిలీజ్ చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదని, అందుకే ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నుండి ఏ రీ రిలీజ్ ఉండదని అంటున్నారు.
ఇది అభిమానులకు కాస్త ఇబ్బంది కి గురి చేసే విషయమే. ఎందుకంటే ఆగస్టు 9 న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘అతడు’ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు మార్కెట్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. మహేష్ బాబు కొత్త సినిమా రిలీజ్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో, అలాంటి క్రేజ్ ఈ చిత్రానికి ఉంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ రికార్డు ని కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే బద్దలు కొట్టగలరు. కానీ ఇప్పుడు ఓజీ కారణంగా ఆ ఛాన్స్ మిస్ అవుతుంది. అందుకే పవన్ అభిమానులు ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 25 న ఉగాది కానుకగా విడుదల చేస్తే ఆ సినిమాకు కూడా బాగా కలిసి వస్తుందని, సెప్టెంబర్ 2న పాత సినిమాని రీ రిలీజ్ చేసుకోవచ్చని అంటున్నారు.
Also Read : ఆపరేషన్ సిందూర్ బ్రీఫింగ్.. దేశం దృష్టిని ఆకర్షించిన మహిళా ఆధికారులు