Pawan Kalyan : ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నప్పటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తన సినిమాలతో పాన్ ఇండియాలో తన లక్కును పరీక్షించుకోనే ప్రయత్నం చేస్తున్నాడు…ప్రస్తుతం ఆయన వరుసగా మూడు సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండడం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ‘పవన్ కళ్యాణ్’ (Pavan Kalyan)…ప్రస్తుతం అటు పాలిటిక్స్ లో బిజీగా ఉంటూనే ఇటు సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం…ఏపీలో గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ అంతకు ముందు సెట్స్ మీద ఉంచిన సినిమాలను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన ఆయన ఈ సినిమాని తొందరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇక సుజిత్ (Sujeeth) డైరెక్షన్ లో చేస్తున్న ఓజీ సినిమాను సైతం సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమా మీద భారీ ఫోకస్ ని పెట్టి షూటింగ్ లో పాల్గొంటూ శరవేగంగా సినిమాని కంప్లీట్ చేసే విధంగా ముందుకు సాగుతున్నారు.
Also Read : వన్ నేషన్-వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమే: పవన్ కళ్యాణ్
ఇక రీసెంట్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Usthad Bhagath Sing) సినిమా నుంచి కూడా ఒక పోస్టర్ అయితే వచ్చింది. తొందర్లోనే షూట్ స్టార్ట్ చేయబోతున్నాం అంటూ ఆ పోస్టర్ ద్వారా తెలియజేశారు…మరి ఈ సినిమా కూడా ఈ సంవత్సరంలోనే రిలీజ్ అవ్వబోతుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి. మొత్తానికైతే ఈ సంవత్సరంలో మూడు సినిమాలు రిలీజ్ చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక భారీ రికార్డును కూడా క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన ఒక సంవత్సరంలో రెండు సినిమాలను రిలీజ్ చేసింది కూడా లేదు.
కానీ ఏకంగా మూడు సినిమాలను రిలీజ్ చేసి తన అభిమానులకు ఆనందాన్ని పంచబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఆయన నుంచి ఈ సినిమాలు వస్తుండడం ప్రతి ఒక్కరిని ఆనందానికి గురిచేస్తుంది. మరి ఈ సినిమాలు ఎలాంటి రిజల్ట్ ని మిగులుస్తాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ని అమాంతం తారాస్థాయికి పెంచుతాయా లేదంటే ప్లాపులుగా మిగులుతాయా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…