Pawan Kalyan : మొన్న రాత్రి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Dy CM Pawan Kalyan) ప్రముఖ స్టార్ నిర్మాతలతో అత్యవసర భేటీ నిర్వహించాడట. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం షూటింగ్ కార్యక్రమాలు 90 శాతం కి పైగా పూర్తి అయ్యింది. వచ్చే నెల 9న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఈ సినిమా వాయిదా పడినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలో వినిపిస్తున్నాయి. ఇది అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. కానీ మే నెలలోనే విడుదల చేయాలనీ నిర్మాత AM రత్నం ప్రయత్నం చేస్తున్నాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ‘ఓజీ'(They Call Him OG), ‘ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh)’ సినిమాలను కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఓజీ చిత్రం కూడా దాదాపుగా 70 శాతం కి పైగా షూటింగ్ పూర్తి అయ్యింది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కేవలం 20 శాతం మాత్రమే పూర్తి అయ్యింది.
Also Read : పవన్ కళ్యాణ్ అవి రహస్యంగా చేస్తాడు… ఆసక్తి రేపుతున్న రేణు దేశాయ్ లేటెస్ట్ కామెంట్స్
అయితే మూడు సినిమాలకు డేట్స్ కేటాయించే విషయంలోనే ఆయన తన నిర్మాతలను ఇంటికి పిలిపించి చర్చించినట్టు తెలుస్తుంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని మే 10 లోపు పూర్తి చేయాలనీ అనుకుంటున్నాడట. ఈ సినిమాకు కేవలం నాలుగు రోజుల డేట్స్ ఇస్తే చాలు. అదే విధంగా మే నెలలోనే ఓజీ చిత్రాన్ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకు తగిన ఏర్పాట్లు చేయమని నిర్మాత DVV దానయ్య తో అన్నాడట. మే నెలలో షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ 5 న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది. జూన్ నెల నుండి నాన్ స్టాప్ గా ఈ చిత్రం నుండి అప్డేట్స్ రానున్నాయి. ముందుగా మొదటి లిరికల్ వీడియో సాంగ్ ‘ఫైర్ స్ట్రోమ్’ ని జూన్ నెలలో విడుదల చేస్తారట.
ఇక హరీష్ శంకర్ దర్శకత్వం లో మొదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ కి జులై నెల నుండి బల్క్ గా డేట్స్ కేటాయిస్తానని చెప్పుకొచ్చాడట పవన్ కళ్యాణ్. ఆయన నుండి చాలా కాలం తర్వాత వస్తున్నా ఫక్తు కమర్షియల్ మూవీ ఇది. ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు గ్లింప్స్ వీడియోస్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బ్లాక్ బస్టర్ కల ఉట్టిపడింది అంటూ అభిమానులు అప్పట్లో కామెంట్స్ కూడా చేశారు. మొత్తానికి ఈ ఏడాది లో పవన్ కళ్యాణ్ నుండి రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయి అన్నమాట. వచ్చే ఏడాది సమ్మర్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం రానుంది. అయితే పాన్ ఇండియన్ సినిమాలు రాజ్యం ఏలుతున్న రోజుల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి కమర్షియల్ సినిమాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
Also Read : ‘ఓజీ’ ఈ ఏడాది లో విడుదల అవ్వడం కష్టమేనా..? జూన్ లో ఏమి జరగబోతుంది?