AP Deputy CM Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత అలాంటి పీక్ రేంజ్ ఫాలోయింగ్ ని ఈ జనరేషన్ లో చూస్తుంది మాత్రం పవన్ కల్యాణే. అయితే పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో తప్ప, మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా క్రేజ్ లేదు, ఆయన పేరు కూడా ఇతర రాష్ట్రాల్లో చాలా మందికి తెలిసి ఉండదు అని ఆయనంటే ఇష్టం లేని వాళ్ళు అంటుంటారు. అయితే అదంతా ఫేక్ ప్రచారమే అని నిన్న అందరికీ అర్థమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ ఎన్డీయే లో భాగస్వామి అవ్వడంతో, అమిత్ షా కోరిక మేరకు నిన్న, నేడు కొన్ని ప్రాంతాల్లో బీజేపీ పార్టీ తరుపున ప్రచారం చేసాడు.
పవన్ కళ్యాణ్ సభలకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అసలు ఈయన వెళ్ళింది ఆంధ్ర ప్రదేశ్ కా?, లేదా మహా రాష్ట్ర కా?, ఇంత క్రేజ్ ఎలా వచ్చింది. ఇతర హీరోలు లాగా ఆయన ఇప్పటి వరకు ఎలాంటి పాన్ ఇండియన్ సినిమాలోనూ నటించాడు. త్వరలో ఆయన నటించిన పాన్ ఇండియన్ సినిమాలు ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’ వంటి సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి కానీ, ప్రభాస్ తరహాలో ఇప్పటి వరకు భారీ స్కేల్ పాన్ ఇండియన్ సినిమాలు చేయలేదు.అయినప్పటికీ ఇంత క్రేజ్ ఎలా వచ్చింది బాబోయ్ అంటూ విశ్లేషకులు కూడా జుట్టు పీక్కుంటున్నారు. అక్కడి మీడియా తో పాటు, లోకల్ బీజేపీ లీడర్స్ కి కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ని చూసి ఫ్యూజులు ఎగిరేంత పని అయ్యింది. అక్కడి మీడియా చానెల్స్ పవన్ క్రేజ్ పై ప్రత్యేక కథనాలను కూడా ప్రచురిస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ కి నేషనల్ లెవెల్ లో ఇంత క్రేజ్ రావడానికి కారణం 2024 సార్వత్రిక ఎన్నికలే అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం, దేశ రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చేసింది. నేడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే, అందుకు కారణం పవన్ కల్యాణే. ఆయనే కనుక కూటమి కట్టకపోయుంటే, టీడీపీ+ జనసేన ఎంపీ సీట్ల బలం ఎన్డీయే లో ఉండకపోయుంటే, నేడు కాంగ్రెస్ అధికారం లో ఉండేది. అలాంటి విపత్కరమైన సమయంలో కాపాడాడు కాబట్టే, నరేంద్ర మోడీ పార్లమెంట్ హాల్ లో అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ఎంపీల సమక్ష్యంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ‘ఇతను పవన్ కాదు..తుఫాన్’ అని అంటాడు. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ క్రేజ్ నార్త్ మొత్తం ఒక రేంజ్ లో పాకేసింది. మహారాష్ట్ర పర్యటనలో ఆయనకీ వచ్చిన రెస్పాన్స్ ఇందుకు ఒక ఉదాహరణ.