Pawan kalyan Bro : రేపే పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ మూవీ టీజర్.. టీజర్ లోని డైలాగ్స్ వింటే మెంటలెక్కిపోతారు.

రేపు సాయంత్రం 5 గంటల నాలుగు నిమిషాలకు ఈ టీజర్ విడుదల అవ్వబోతుంది అట. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిటికె వేస్తున్న ఫోటోని ఒకటి విడుదల చేసి అధికారిక ప్రకటన చేసారు.

Written By: NARESH, Updated On : June 28, 2023 5:52 pm
Follow us on

Pawan kalyan Bro : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ మూవీ నేటి నుండి సరిగ్గా నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ మూవీ టీజర్ కోసం అభిమానులు చాలా కాలం నుండి కళ్ళు కాయలు లాగ ఎదురు చూస్తూ ఉన్నారు.వారి ఎదురు చూపులకు తెరదించుతూ రేపే ఈ సినిమా టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు.

రేపు సాయంత్రం 5 గంటల నాలుగు నిమిషాలకు ఈ టీజర్ విడుదల అవ్వబోతుంది అట. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిటికె వేస్తున్న ఫోటోని ఒకటి విడుదల చేసి అధికారిక ప్రకటన చేసారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ లేడు, కేవలం ఆయన చెయ్యి మాత్రమే కనిపిస్తుంది. అయ్యినప్పటికీ కూడా చూడగానే ఏముందిరా బాబు అనిపించింది. పవన్ కళ్యాణ్ చేతికి కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందని అభిమానులు ఈ సందర్భంగా చెప్పుకొస్తున్నారు.

ఇక పోతే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ మ్యానరిజమ్స్ మరియు అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయట. టీజర్ చూడగానే ఇది కదా పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా అంటే అని అందరికీ అనిపిస్తుందట. ఇన్ని రోజులు మనకు కేవలం నటుడిగా మాత్రమే సుపరిచితమైన సముద్ర ఖని లో ఇంత టాలెంట్ దాగుందా అని అందరూ అనుకుంటారట. టీజర్ ఇన్ని రోజులు లేట్ అయ్యినప్పటికీ కూడా, ఆ ఆలస్యానికి తగ్గట్టుగానే, అభిమానుల ఆకలి తీర్చే విధంగా ఈ టీజర్ కట్ ని తయారు చేయించారట.

బయ్యర్స్ కూడా ఈ టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిన్న విడుదలైన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ మూవీ గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు. వింటేజ్ పవన్ కళ్యాణ్ మరో సారి మన ముందుకి వచ్చాడని అభిమానులు సంబరపడిపోయారు. మరి ఆ వింటేజ్ మార్క్ రేపు విడుదల అవ్వబొయ్యే టీజర్ లో కూడా కనిపిస్తుందో లేదో చూడాలి.