Bro Advance Bookings: ‘బ్రో’ లాంటి రీమేక్ అడ్వాన్స్ బుకింగ్స్ తో ‘ఆదిపురుష్’ అవుట్..పవర్ స్టార్ మాస్ కి హద్దులే లేవు!

ఈ 70 షోస్ నుండి దాదాపుగా 8 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి, ఇది ఆదిపురుష్ కంటే ఎక్కువ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంతే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి 'ఆదిపురుష్' కంటే మంచి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు.

Written By: Vicky, Updated On : July 25, 2023 10:58 am

Bro Advance Bookings

Follow us on

Bro Advance Bookings: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ మరో మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ ప్రాంతం లో ప్రారంభం అయ్యాయి,రెస్పాన్స్ అదిరిపోయింది. రేపు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యబోతున్నారు.

ఇక్కడ రెస్పాన్స్ లో ఉండబోతుందో చూడాలి. రీసెంట్ గానే కర్ణాటక లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. సాధారణంగా ఈ ప్రాంతం లో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉంటాయి. టాక్ వస్తేనే కలెక్షన్స్ వస్తాయి . కానీ ‘బ్రో ది అవతార్’ చిత్రానికి మాత్రం ప్రారంభం నుండే అన్నీ ఫ్యాన్స్ షోస్ సోల్డ్ అయిపోయాయి. రెగ్యులర్ షోస్ కి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి. కేవలం 70 షోస్ తో ఈ సినిమా 14 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.

ఈ 70 షోస్ నుండి దాదాపుగా 8 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి, ఇది ఆదిపురుష్ కంటే ఎక్కువ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంతే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి ‘ఆదిపురుష్’ కంటే మంచి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు.

కేవలం ప్రీమియర్స్ నుండే 1 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లను రాబడుతుందని, ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లో రెండవ 1 మిలియన్ డాలర్ సినిమాగా నిలుస్తుందని చెప్తున్నారు. ‘ఆదిపురుష్’ చిత్రానికి ఇక్కడ ప్రీమియర్స్ ద్వారా కేవలం 8 లక్షల 50 వేల డాలర్స్ మాత్రమే వచ్చాయి. కానీ బ్రో చిత్రానికి ప్రీమియర్స్ నుండే 1 మిలియన్ కి పైగా డాలర్స్ ని వసూలు చేస్తుందని, అలాగే ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి ఈ చిత్రానికి 15 లక్షల డాలర్స్ వస్తాయని అంటున్నారు.చూడాలి మరి .