
పవన్ కళ్యాణ్ పేరులోనే ‘పవర్’ ఉంది. ఆ పవర్ ను ఆసాంతం వాడాలే కానీ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు అవుతాయి. అలాంటి పవర్ ప్యాక్డ్ పవన్ కల్యాణ్ తో మరోసారి పవర్ ఫుల్ పాత్రను తీర్చిదిద్దారు. ఇటీవల విడుదలైన ‘బీమ్లా నాయక్’ మూవీ గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్ర అభిమానులను షేక్ చేసింది. ఆ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గ్యాప్ లో చేసిన పని వైరల్ అయ్యింది.
ప్రస్తుతం పవన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ పర్యవేక్షణలో ‘బీమ్లా నాయక్’ మూవీని పవన్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రానా, పవన్ నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీపై బోలెడు అంచనాలున్నాయి.
ఈ షూటింగ్ గ్యాప్ లో చిన్న విరామం దొరకడంతో పవన్ కళ్యాణ్ గన్ చేతబట్టారు. టార్గెట్ ను షూట్ చేస్తూ బుల్లెట్ల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్రబృందం తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ‘భీమ్లా నాయక్ ఇన్ బ్రేక్ టైమ్’ అని పేర్కొంటూ విడుదల చేసిన ఈ వీడియోలో పవన్ తుపాకీ పట్టి వీరావేశంతో కాలుస్తున్న స్టిల్ షేక్ చేసేలా ఉంది.
మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న ‘అయ్యప్పమ్ కోషీయమ్’ రిమేక్ గా తెలుగులో పవన్ -రానా హీరోలుగా ‘భీమ్లా నాయక్’ రూపొందుతోంది. ఐశ్వర్య రాజేశ్, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆన్ ఫైరింగ్ వీడియో వైరల్ అవుతోంది.