Bheemla Nayak Title Song: ‘బీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ గిరిజన యాసలో ఆదిరిపోలా..

Bheemla Nayak Title Song: మాండలికాలు పట్టడంలో అటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఇటు త్రివిక్రమ్ (Trivikram) రూటే సపరేటు.. శ్రీకాకుళం యాసలో ‘ఖుషీ’ సినిమాలో పవన్ పాడిన పాట ఆ సినిమాకే హైలెట్.. ఆతర్వాత సినిమాల్లోనూ తెలుగు రాష్ట్రాల్లోని యాస, భాషలను తెరపైకి తీసుకొచ్చి పవన్ అలరిస్తుంటాడు. ఇప్పుడు నల్లమల, ఖమ్మం, ఆదిలాబాద్ లో విస్తరించి ఉన్న గిరిజనం సంసృతిని తాజాగా ‘బీమ్లానాయక్’ సినిమాలో తెరపైకి తెస్తున్నాడు. ‘నాయక్’ సామాజికవర్గం ఎక్కువగా నల్లమల, ఆదిలాబాద్, […]

Written By: NARESH, Updated On : September 2, 2021 3:02 pm
Follow us on

Bheemla Nayak Title Song: మాండలికాలు పట్టడంలో అటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఇటు త్రివిక్రమ్ (Trivikram) రూటే సపరేటు.. శ్రీకాకుళం యాసలో ‘ఖుషీ’ సినిమాలో పవన్ పాడిన పాట ఆ సినిమాకే హైలెట్.. ఆతర్వాత సినిమాల్లోనూ తెలుగు రాష్ట్రాల్లోని యాస, భాషలను తెరపైకి తీసుకొచ్చి పవన్ అలరిస్తుంటాడు.

ఇప్పుడు నల్లమల, ఖమ్మం, ఆదిలాబాద్ లో విస్తరించి ఉన్న గిరిజనం సంసృతిని తాజాగా ‘బీమ్లానాయక్’ సినిమాలో తెరపైకి తెస్తున్నాడు. ‘నాయక్’ సామాజికవర్గం ఎక్కువగా నల్లమల, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉంటారు. వారి ఆచార, వ్యవహారాలు, సంస్కృతులు వేషభాషలు విభిన్నం.. పవన్ ను ‘నాయక్’గా చూపిస్తున్న సినిమాలో వారి సంస్కృతికి తగ్గట్టుగానే తాజాగా పాటను డిజైన్ చేశారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులకు ‘బీమ్లా నాయక్’ సినిమా నుంచి ఒక సర్ ప్రైజ్ పాటను కానుకగా ఇచ్చారు. పవన్ హీరోగా ‘బీమ్లా నాయక్’ మూవీ తెరకెక్కుతోంది. అందులోని తొలి పాటను విడుదల చేశారు. పవన్, రానా (Rana Daggubati) కాంబినేషన్ లో మలయాళ మూవీకి రిమేక్ గా వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ ఫస్ట్ లుక్ లు అలరించాయి.

తాజాగా ఈరోజు బీమ్లా నాయక్ తొలి పాటను ఆవిష్కరించారు. థమన్ (Thaman)  ఈ పాట కోసం గిరిజన సంస్కృతి నేపథ్యాన్ని తీసుకొని అద్భుతంగా పాటను రూపొందించినట్టు అర్థమవుతోంది. సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి త్రివిక్రమ్, మాటలు, స్క్రీన్ ప్లే సహకారం అందిస్తున్నాడు. జనవరి 12న సినిమా విడుదల చేస్తున్నారు.

పాట చూస్తే ఆద్యంతం గిరిజన సంస్కృతి సంప్రదాయాల కలబోతగా ఉంది. ఆ తొలి చరణం, పాట ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ‘అల వైకుంఠపురంలో’ తర్వాత త్రివిక్రమ్ సాన బెట్టడంతో థమన్ నుంచి మంచి సంగీతం సాంస్కృతిక లోతుల్లోని పాత గేయాలకు కొత్త రూపునిచ్చి అద్భుతంగా తీసుకొస్తున్నారని చెప్పొచ్చు.