https://oktelugu.com/

Bheemla Nayak Postponed: ఆర్ఆర్ఆర్ దెబ్బకు భీమ్లా నాయక్ వాయిదా?

Bheemla Nayak Postponed : తగ్గేదేలే అని సంక్రాంతి రేసులో నిలబడ్డ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ వెనక్కి తగ్గాడు. దర్శకధీరుడు రాజమౌళి స్వయంగా పవన్ కళ్యాణ్ ను కలిసి బుజ్జగించినా.. నిర్మాత దానయ్య కలిసి ఆ నిర్మాతతో మాట్లాడినా పని కాలేదు. చివరకు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగి పవన్ కు, త్రివిక్రమ్ టీంకు సర్ధిచెప్పి భీమ్లా నాయక్ ను వాయిదా వేయించినట్టు సమాచారం. అనుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” వాయిదా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 20, 2021 / 08:38 PM IST
    Follow us on

    Bheemla Nayak Postponed : తగ్గేదేలే అని సంక్రాంతి రేసులో నిలబడ్డ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ వెనక్కి తగ్గాడు. దర్శకధీరుడు రాజమౌళి స్వయంగా పవన్ కళ్యాణ్ ను కలిసి బుజ్జగించినా.. నిర్మాత దానయ్య కలిసి ఆ నిర్మాతతో మాట్లాడినా పని కాలేదు. చివరకు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగి పవన్ కు, త్రివిక్రమ్ టీంకు సర్ధిచెప్పి భీమ్లా నాయక్ ను వాయిదా వేయించినట్టు సమాచారం.

    Bheemla nayak postponed

    అనుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” వాయిదా పడింది. ఈ మేరకు భీమ్లా నాయక్ మూవీ టీం అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. రేపు అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ నిర్మాత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీడియాకు సమాచారం పంపారు.

    థియేటర్లను కేటాయించడంలో పెద్ద సమస్య అవుతుందని, తేదీని మార్చాలని “ఆర్ఆర్ఆర్” నిర్మాతలు మరియు ఇతరులు “భీమ్లా నాయక్” నిర్మాతలను అభ్యర్థించినట్లు అంతర్గత సమాచారం.

    పరిశ్రమలోని పెద్దలు చర్చలు ప్రారంభించిన తర్వాత, పవన్ కళ్యాణ్ తన ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఫిబ్రవరిలో కొత్త తేదీ నిర్ణయించబడుతుంది. కాగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ ను ఓ రేంజ్ లో చేస్తున్నాడు రాజమౌళి. ఎన్టీఆర్, రాంచరణ్, ఆలియాభట్ , అజయ్ దేవ్ గణ్ సహా చాలా మందితో అన్ని భాషల్లోనూ హోరెత్తిస్తున్నారు. తాజా ట్రైలర్ తో సినిమాపై హైప్ విపరీతంగా పెరిగింది. బాలీవుడ్ సినిమాలే ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు వాయిదాపడ్డాయి. ఈ క్రమంలోనే భీమ్లా నాయక్ మూవీ టీం కూడా అనవసరంగా పోటీపడవద్దనే తప్పుకున్నట్టు సమాచారం.

    “భీమ్లా నాయక్” షూటింగ్ పార్ట్ పూర్తయింది. మేకర్స్ నాలుగు పాటలను కూడా విడుదల చేశారు.ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ప్యాన్ ఇండియా మూవీ కోసం పవన్ తన మనసు మార్చుకున్నాడు. ఇక అంత పెద్ద మూవీతో పోటీపడి నష్టపోవడం.. ఆర్ఆర్ఆర్ కు నష్టం చేకూర్చవద్దనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

    Tags