Pawan Kalyan: ఈమధ్య కాలం లో టాలీవుడ్ లో స్టార్ హీరోలు కేవలం సినిమాల్లో నటించడమే కాకుండా, ఇతర క్రాఫ్ట్స్ లో కూడా భాగం అయ్యేందుకు మక్కువ చూపిస్తున్నారు. నాని(Natural Star Nani) లాంటి హీరోలు ఒక పక్క హీరో గా సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతగా కొత్త తరహా సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్ ఆడియన్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతిని ఇస్తున్నాడు. నిర్మాతగా ఇప్పటి వరకు ఆయన కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేదంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆయన ఏ రేంజ్ కథలను ఎంపిక చేసుకుంటున్నాడు అనేది. అదే విధంగా మహేష్ బాబు(Superstar Mahesh Babu) కూడా నిర్మాతగా మారి కొత్త తరహా సినిమాలను అందించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) వంతు వచ్చేసింది. గతం లో ఈయన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ ని స్థాపించిన సంగతి తెలిసిందే.
ఈ బ్యానర్ పై ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది, పవన్ కళ్యాణ్ కి కూడా నిర్మాతగా భారీ దెబ్బనే తగిలింది. అయినప్పటికీ కూడా ఆయన వెనక్కి తగ్గకుండా, నితిన్ ని హీరో గా పెట్టి ‘చల్ మోహన్ రంగ’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. ఇక అప్పటి నుండి పవన్ కళ్యాణ్ నిర్మాణ రంగం వైపు చూడలేదు. కేవలం నటించడం వరకే తన పని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా ఫుల్ బిజీ అవ్వడం తో, ఒకప్పటి లాగా పూర్తి స్థాయి ఫోకస్ సినిమాల్లో హీరో గా నటించడం పై పెట్టలేడు కాబట్టి, నిర్మాతగా వ్యహరించాలని అనుకుంటున్నాడు. నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పలేదు, వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ నుండి సినిమాలు చేస్తాడు, కానీ రెగ్యులర్ గా ఉండవు అనుకోవచ్చు.
ఇకపోతే రీసెంట్ గానే ఆయన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో చేతులు కలిపి నిర్మాణం లో భాగం అయ్యేందుకు చూస్తున్నాడు. వరుసగా నాలుగు చిత్రాలు వీళ్లిద్దరు కలిసి నిర్మించబోతున్నారట. అందులో పవన్ కళ్యాణ్ రెండు సినిమాల్లో హీరో గా నటిస్తాడట, మిగిలిన రెండు సినిమాలు వేరే హీరోలతో చేస్తాడట. అందులో ఒక చిత్రం తమిళ హీరో ధనుష్ తో ఉంటుంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించే అవకాశం ఉందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ నుండి ఈ చిత్రం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ధనుష్ తెలుగు లో ఇప్పటి వరకు సార్, కుబేర వంటి చిత్రాలు చేసాడు. రెండు కూడా కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనతో ఎలాంటి సినిమాని నిర్మించబోతున్నాడో చూడాలి.