Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ శరవేగంగా సాగుతుంది..ఇటీవలే 45 రోజుల పాటు జరిగిన ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు లేటెస్ట్ గా మరో షెడ్యూల్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుపుకుంటుంది..రామోజీ ఫిలిం సిటీ లో తీసిన 45 రోజుల షెడ్యూల్ లో ఇంటర్వెల్ సన్నివేశానికి సంబంధించిన 15 నిమిషాల నిడివి ఉన్న ఫైట్ సీన్ ని తీశారు.

ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలవడబోతుందట..అయితే ఈ భారీ షెడ్యూల్ యాక్షన్ సీక్వెన్స్ మొత్తం పవన్ కళ్యాణ్ అద్వర్యం లోనే జరిగిందట..స్టంట్ మాస్టర్ విజయ్ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూచనల మేరకే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాడట..ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు..వాటికి సంబంధించిన మేకింగ్ వీడియో ని ఇదివరకే మనం చూసాము.
పవన్ కళ్యాణ్ గతం లో కూడా ఎన్నో సినిమాలకు స్టంట్ మాస్టర్ గా పనిచేసాడు..తమ్ముడు , బద్రి , ఖుషి , జానీ ,బాలు మరియు సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలకు ఆయన స్టంట్ మాస్టర్ గా పనిచేసాడు..ఇవి మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘డాడీ’ మూవీ కి కూడా పవన్ కళ్యాణ్ ఫైట్ మాస్టర్ గా పనిచేసాడు..ఈ సినిమాల్లోని ఫైట్స్ అన్నిటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇప్పుడు హరి హర వీరమల్లు కి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు..ఇంటర్వెల్ సన్నివేశం తో పాటుగా క్లైమాక్స్ లో వచ్చే 15 నిమిషాల ఫైట్ సీన్ కూడా సినిమాకి హైలైట్ గా నిలవబోతుందట.

పాన్ ఇండియన్ లెవెల్ లో అన్ని బాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కట్ కూడా సిద్ధం గా ఉంది..ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న ‘ఖుషి’ సినిమాతో అటాచ్ చేసి విడుదల చేద్దాం అనుకున్నారు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ పెండింగ్ ఉండడం తో ఆ ఆలోచనని విరమించుకున్నారు.