Pawan Kalyan And Prabhas: ఒక చేత్తో సహాయం చేస్తే మరో చేతికి తెలియకూడదు అని అంటుంటారు పెద్దలు. దీన్ని మన టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) , ప్రభాస్(Rebel Star Prabhas) వంటి సూపర్ స్టార్స్ చాలా గట్టిగా అనుసరిస్తుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీళ్లిద్దరు చేసిన సహాయాలు ఎవరో చెప్తే తెలియడమే కానీ, వీళ్ళు మాత్రం ఎప్పుడు చెప్పుకోలేదు. మనకు బయటకు తెలిసినవి కొన్ని మాత్రమే. తెలియనివి వందల్లో ఉంటాయి. అభిమానులకు ఇలాంటి గొప్ప మనుషులకు ఫ్యానిజం చేస్తున్నందుకు గర్వపడే సందర్భాలు వీళ్లిద్దరు ఇస్తూనే ఉన్నారు. రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి ఒక వృద్ధాశ్రమమం ని నడుపుతున్న విషయాన్ని ప్రముఖ టీవీ యాంకర్ సుమ ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో జరిగిన లైవ్ ఇంటరాక్షన్ లో ఈ విషయం గురించి చెప్పుకొచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం లోని ఒక వృద్ధాశ్రమం నిర్మాణానికి పవన్ కళ్యాణ్, ప్రభాస్ లు చాలా సహాయం చేశారని యాంకర్ సుమ చెప్పుకొచ్చింది. వీళ్ళిద్దరితో పాటు టాలీవుడ్ కి చెందిన మరికొందరు కూడా ఈ వృద్ధాశ్రమం నిర్మాణానికి సహాయపడ్డారని, కానీ వాళ్లిద్దరూ మాత్రం రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ అన్నీ విధాలుగా సహాయం చేసేవారని చెప్పుకొచ్చింది సుమ. ముఖ్యంగా ప్రభాస్ అయితే ప్రతీ నెల ఆ వృద్దులకు అవసరమయ్యే ఖర్చులు పంపిస్తున్నదని సుమ చెప్పుకొచ్చింది. ఎలాంటి ప్రచారం లేకుండా ప్రభాస్ ఇలాంటి కార్యక్రమాలు చాలానే చేస్తున్నాడని చెప్పుకొచ్చింది సుమ. ఇలా ఈ ఇద్దరు హీరోలు వెండితెర మీద మాత్రమే కాకుండా, నిజ జీవితం లో కూడా హీరోలుగా నిలిచి, తమ అభిమానులకు గొప్ప ఆదర్శప్రాయులుగా నిలుస్తున్నారు. హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా, తమకు రావాల్సిన రెమ్యూనరేషన్ ని నిర్మాతల ముక్కు పిండి మరీ రాబట్టే హీరోలు ఉన్న ఈ కాలం లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి వాళ్ళు కూడా ఉండడం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం అంటూ సోషల్ మీడియా లో ఈ ఇద్దరి హీరోల అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.