Pawan kalyan and Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తండేల్’ చిత్రం మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదలకు ముందు పాటల ద్వారా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత పెద్ద హిట్ అవుతుందని ట్రేడ్ చాలా బలంగా నమ్ముతుంది. సెన్సార్ రిపోర్ట్స్ కూడా చాలా ప్రామిసింగ్ గా వచ్చాయి. ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్ చాలా కొత్తగా తెరకెక్కించారని, సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు, భావోద్వేగ సన్నివేశాలు ఆడియన్స్ హృదయాలను హత్తుకునేలా చేస్తుందని రిపోర్ట్స్ వచ్చాయి. మరి ఆ రేంజ్ లో సినిమా ఉందో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు ఎదురు చూడాల్సిందే. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని గీత ఆర్ట్స్ సంస్థ సుమారుగా 80 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. ‘మగధీర’ తర్వాత అంతటి బడ్జెట్ పెట్టింది ఈ సినిమాకే.
అల్లు అరవింద్ తన కొడుకు మీద కూడా ఇప్పటి వరకు ఇలాంటి ప్రయోగం చేయలేదు. అలాంటిది నాగచైతన్య మీద చేశాడంటే ఈ సినిమా కంటెంట్ మీద ఆయనకు ఎలాంటి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈమధ్య వస్తున్నా కొత్త సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ హైక్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్స్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంది కానీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సినీ ఇండస్ట్రీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ఇటీవలే విడుదలైన ప్రతీ పెద్ద సినిమాకి ఏది కోరితే అది అందిస్తూ ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. ఇప్పుడూ ‘తండేల్’ చిత్రానికి కూడా టికెట్ హైక్స్ ఇచ్చి తమ నిబద్ధతని మరోసారి నిరూపించుకుంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. సినీ ఇండస్ట్రీ నుండి పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఆయన పార్టీ ఎమ్మెల్యే కందుల దుర్గేష్ వద్ద ఉండడంతో ఇండస్ట్రీ కి అవసరమైన పనులు పూర్తి అవుతున్నాయి.
ఈ సందర్భంగా మూవీ టీం మొత్తం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు తెలియచేస్తూ ట్వీట్స్ వేశారు. కాసేపటి క్రితం ఆ చిత్రం హీరో నాగ చైతన్య కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబులను ట్యాగ్ చేస్తూ కృతఙ్ఞతలు తెలియజేసాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా సినిమాకి టికెట్ హైక్స్ పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు. మీరు మా సినిమాకి అందించిన ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరచిపోలేము’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Extending my deepest gratitude to the Government of Andhra Pradesh for approving the ticket hike for our #Thandel
Sincere thanks to Hon'ble @AndhraPradeshCM, Shri @ncbn garu, Hon'ble @APDeputyCMO, Shri @PawanKalyan garu, and Cinematography Minister @kanduladurgesh garu for your…
— chaitanya akkineni (@chay_akkineni) February 6, 2025