https://oktelugu.com/

Pawan Kalyan : అకీరా, ఆద్య పవన్ కళ్యాణ్ తో ఏ భాషలో మాట్లాడతారో తెలుసా? కూతురి కోసం ఆ లాంగ్వేజ్ నేర్చుకున్న పవర్ స్టార్

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్యల బాల్యం పూణేలో గడిచింది. వారిద్దరూ అక్కడే చదువుకున్నారు. టీనేజ్ వరకు అక్కడే ఉన్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : March 14, 2025 / 09:16 AM IST
    Pawan Kalyan , Akira Nandan

    Pawan Kalyan , Akira Nandan

    Follow us on

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్యల బాల్యం పూణేలో గడిచింది. వారిద్దరూ అక్కడే చదువుకున్నారు. టీనేజ్ వరకు అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో వారికి తెలుగు వచ్చా? తండ్రి పవన్ కళ్యాణ్ తో ఏ భాషలో మాట్లాడతారు? అనే సందేహాలు ఉన్నాయి. ఈ ప్రశ్నకు రేణు దేశాయ్ ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చింది.

    Also Read : పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడుతారు..ఇంత డబ్బులు ఎక్కడివి?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకుని చాలా కాలం అవుతుంది. డైవర్స్ అనంతరం రేణు దేశాయ్ పిల్లలు అకీరా, ఆద్యలతో పూణే వెళ్ళిపోయింది. అక్కడే సెటిల్ అయ్యింది. ఇక అకీరా, ఆద్యలు అక్కడే చదువుకున్నారు. వాళ్ళ బాల్యం అక్కడే గడిచింది. రేణు దేశాయ్ ఉత్తరాదికి చెందిన మహిళ. ఇక పిల్లలు పూణేలో పెరిగి పెద్దయ్యారు. ఈ క్రమంలో వారికి తెలుగు వచ్చా అనే సందేహం అందరిలో ఉంది.

    రేణు దేశాయ్ తో విడిపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ స్నేహం కొనసాగిస్తున్నారు. పిల్లల కోసం వారు మిత్రులుగా మారారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ పూణే వెళ్లేవారని, పిల్లల్ని కలిసే వారని రేణు దేశాయ్ ఓ సందర్భంలో క్లారిటీ ఇచ్చింది. ఇక పిల్లలతో పవన్ కళ్యాణ్ సంభాషణ ఎలా ఉంటుంది, అనే విషయం పై కూడా స్పష్టత ఇచ్చింది. ఆద్య తండ్రితో చాలా చనువుగా మాట్లాడుతుందట. ఆయనకి ఆర్డర్స్ వేస్తుందట. నువ్వు మమ్మల్ని చూడటానికి ఎప్పుడు వస్తున్నావ్? ఫలానా డేట్ కి రావాలి? అని డిమాండ్ చేసేదట.

    ఆద్య మాట ప్రకారం పవన్ కళ్యాణ్ వీలు చేసుకుని పూణే వెళ్లేవారట. ఇక ఆద్య, పవన్ కళ్యాణ్ మరాఠిలో మాట్లాడుకుంటారట. కూతురు కోసం పవన్ కళ్యాణ్ మరాఠి నేర్చుకున్నాడట. ఇక అకీరా విషయానికి వస్తే… అతడు కూల్ గా ఉంటాడట. పవన్ కళ్యాణ్ తో అకీరా తెలుగులో మాట్లాడతాడట. వారి మధ్య సినిమాల ప్రస్తావన అసలు రాదట. ఎక్కువగా ఫిలాసఫీ మాట్లాడుకుంటారట. కాబట్టి పవన్ కళ్యాణ్ కూతురు ఆద్యతో మరాఠీలో కొడుకుతో తెలుగులో మాట్లాడతాడన్న మాట.

    ప్రస్తుతం అకీరా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆరున్నర అడుగుల అకీరా మెగా ఫ్యామిలీలోనే అత్యంత పొడగరి. వరుణ్ తేజ్ ని అకీరా బీట్ చేశాడు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ బిజీ కావడంతో అకీరా అరంగేట్రం చేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. దీనిపై అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వారసుడైన అకీరా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ, హరి హర వీరమల్లు తిరిగి చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సైతం ఆయన పూర్తి చేయాల్సి ఉంది.

    Also Read : పవన్ కళ్యాణ్ OG సినిమా పోస్టర్ ని చూపించి భారీ స్కామ్.. రూ.1.34 కోట్లు కొట్టేశారు!